News September 12, 2024
విశాఖలో నలుగురు చైన్ స్నాచర్లు అరెస్ట్

విశాఖలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన నలుగురు నిందితులను 4వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. సీతంపేటకు చెందిన మంగ మెడలో బంగారు మంగళసూత్రాన్ని ఈనెల 7న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. మంగ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీకి చెందిన నిందితులు సంజయ్ సాహాని, విజయ్, దీపక్ కుమార్ మహమ్మద్ ఇస్తకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News November 9, 2025
విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్ రద్దు

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలలో, భద్రత చర్యలలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేసామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సీపీ కోరారు. అలాగే జీవీఎంసీలో కూడా రేపు పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
News November 9, 2025
విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే PGRS రద్దు

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. నవంబర్ 17వ తేదీన PGRS యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.
News November 9, 2025
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఈనెల 14,15వ తేదీల్లో జరగనున్న ప్రపంచస్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ మయూర్ అశోక్‌తో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతారన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.


