News September 12, 2024
స్పెషల్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు అవకాశం

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 2015-2018 వరకు డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకునేందుకు అభ్యర్థులు స్పెషల్ సప్లిమెంటరీ చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అక్టోబర్ 5వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 28, 2026
మార్చి 2న కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

మార్చి 2న ఉదయం 9:30 గంటలకు కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. అర్జీల స్థితిగతుల కోసం 1100 కాల్ సెంటర్ నుంచి సమాచారం పొందవచ్చన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News February 28, 2026
మద్దూర్ నగర్‌లో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలులోని మద్దూర్ నగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా సరైన సమయానికి పింఛన్ అందుతుందా అని లబ్ధిదారులను అడిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News February 28, 2026
ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని విస్తరించాలి: కలెక్టర్

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా సమర్థవంతంగా ప్రచారం చేయాలని కర్నూలు కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. సమాచార శాఖ రూపొందించిన ‘స్వర్ణాంధ్ర@2047’ క్యాలెండర్‌ను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లాలో జీడీపీ, తలసరి ఆదాయం పెంచేందుకు శాఖలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, వ్యవసాయం, పశుసంవర్థకం, డ్రిప్ ఇరిగేషన్ రంగాల్లో రైతుల ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


