News September 12, 2024
DSC అభ్యర్థులకు BIG UPDATE

TG: టెట్ మార్కుల సవరణకు DSC అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు వెబ్సైటులో అభ్యర్థులు టెట్ హాల్‌టికెట్ నంబర్, మార్కులు, ఇతర వివరాల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 13 తర్వాత మార్పులకు మరో అవకాశం ఉండదని, ఇదే లాస్ట్ ఛాన్స్ అని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. మరిన్ని వివరాలకు https://schooledu.telangana.gov.in/ISMS/ను చూడండి.
Similar News
News December 6, 2025
BSBD అకౌంట్లు.. ఇక నుంచి ఫ్రీగా..

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) అకౌంట్లకు RBI గుడ్ న్యూస్ చెప్పింది.
*డిజిటల్ ట్రాన్సాక్షన్లపై నో లిమిట్
*అన్లిమిటెడ్ డిపాజిట్లు. నో డిపాజిట్ ఫీజు
*నెలకు 4 ఫ్రీ ATM విత్‌డ్రాలు, ఉచితంగా ATM/డెబిట్ కార్డు (వార్షిక ఫీజు లేకుండా)
*ఏడాదికి 25 చెక్ లీఫ్స్, ఫ్రీగా పాస్‌బుక్/స్టేట్మెంట్స్
>BSBD అంటే జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. APR 1, 2026 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
News December 6, 2025
శరీరాకృతికి తగ్గ దుస్తులు వేసుకుంటేనే..

కొంతమందికి మంచి పర్సనాలిటీ ఉన్నా ఎంత మంచి దుస్తులు వేసుకున్నా ఆకర్షణీయంగా ఉండరు. అందుకే మన దుస్తుల ఎంపిక మనసుకు నచ్చినట్లు మాత్రమే కాకుండా, శరీరాకృతికి తగ్గట్లుగా దుస్తుల ఎంపిక ఉండాలంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. మన శరీర ప్రత్యేకతను ముందుగా గుర్తించాలి. అలాగే లోపంగా అనిపించే ప్రాంతాన్నీ తెలుసుకోగలగాలి. రెండింటినీ సమన్వయం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఫ్యాషన్ క్వీన్‌లా మెరిసిపోవచ్చంటున్నారు.
News December 6, 2025
సిరి సంపదలను కలిగించే ‘వ్యూహ లక్ష్మి’

శ్రీవారి వక్ష స్థలంలో ‘వ్యూహ లక్ష్మి’ కొలువై ఉంటారు. ఈ అమ్మవారే భక్తుల కోర్కెలు విని శ్రీవారికి చేరవేరుస్తారని పండితులు చెబుతారు. తిరుమల వెళ్లి వ్యూహ లక్ష్మిని దర్శించుకున్నా, ఇంట్లో వ్యూహలక్ష్మిని పూజించినా అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలు లభిస్తాయని నమ్మకం. శ్రీవారి మూలవిరాట్టుపై అమ్మవారు ఎప్పుడూ పసుపు అచ్చుతో కప్పబడి ఉంటారు. ఆ పసుపును మనం ప్రసాదంగా పొందవచ్చు. ☞ అదెలాగో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.


