News September 12, 2024

ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల కట్టడికి కమిటీ?

image

TG: ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నిర్ధారణ, నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లలో అభ్యర్థుల భద్రత, ఫీజులపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు తగ్గడంపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News January 22, 2026

CCMBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (<>CCMB<<>>) 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీఎస్సీ, పీజీ (నేచురల్ సైన్సెస్, మాలిక్యులర్ బయాలజీ), BE/BTech, MBBS, PhD అర్హతతో పాటు పని అనుభవం గల వారు జనవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in

News January 22, 2026

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న బంగారం, వెండి ధరలు ఇవాళ శాంతించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,290 తగ్గి రూ.1,54,310కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,100 పతనమై రూ.1,41,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు తగ్గి రూ.3,40,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News January 22, 2026

ట్రంప్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో మార్కెట్లు

image

యూరప్ దేశాలపై టారిఫ్‌ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 649 పాయింట్లు ఎగబాకి 82,559 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 196 పాయింట్లు పెరిగి 25,372 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, SBI, అదానీ పోర్ట్స్, BEL షేర్లు లాభాల్లో ఉన్నాయి.