News September 12, 2024
మానవ శరీరంలో రెండో గుండె ఏంటో తెలుసా?

మోకాలి కింద ఉండే కండరాలను రెండో గుండెగా పరిగణిస్తారనే విషయం మీకు తెలుసా? ‘ధమనులు గుండె నుంచి రక్తాన్ని శరీరమంతా పంప్ చేస్తాయి. సిరలు పైకి తీసుకొస్తాయి. ఈ ప్రక్రియ గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా జరుగుతుండడంతో కాలి కండరం పంపింగ్‌లో సహాయపడుతుంది. అడుగు వేసినప్పుడల్లా రక్తం పంప్ అవుతుంది. కాబట్టి నడక ఎంతో అవసరం. ఎక్కువ సేపు కూర్చుంటే పాదాన్ని ముందుకు, వెనుకకు కదిలించాలి’ అని వైద్యులు తెలిపారు.
Similar News
News January 7, 2026
కరువు కాస్తయినా గాభరా లావు

కరువు కాలంలో మనకు దొరికేది తక్కువైనా.. ఆకలి, భవిష్యత్తు గురించి ఉండే భయం(గాభరా) మాత్రం చాలా ఎక్కువగా (లావుగా) ఉంటుంది. సాధారణంగా ఏదైనా కొరత ఏర్పడినప్పుడు, ఆ సమస్య కంటే దాని వల్ల కలిగే ఆందోళనే మనిషిని ఎక్కువగా వేధిస్తుందని ఈ మాట చెబుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు పండనప్పుడు రైతుల ఆవేదనను ఈ సామెత ప్రతిబింబిస్తుంది.
News January 7, 2026
అమ్మాయిలకు త్వరగా పెళ్లి కావాలంటే..

స్త్రీ జాతకంలో వివాహానికి కారకుడు గురువు. గురు బలం లేకపోతే ఎంత ప్రయత్నించినా సంబంధాలు నిశ్చయమవ్వవు. గురు గ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం రాఘవేంద్ర స్వామిని లేదా దత్తాత్రేయుని దర్శించుకోవాలి. గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనగలు దానం చేయడం మంచిది. ‘ఓం బృహస్పతయే నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ మేధా దక్షిణామూర్తిని పూజిస్తే జాతకంలో దోషాలు తొలగి, యోగ్యుడైన వరుడితో వివాహం నిశ్చయమవుతుంది.
News January 7, 2026
379 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<


