News September 12, 2024
సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన పెద్దపల్లి ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News September 15, 2025
కరీంనగర్ కలెక్టరేట్ భవనం భద్రమేనా?

KNR కలెక్టరేట్‌ను 1982లో కట్టారు. సరైన నిర్వహణ లేకపోవడంతో అక్కడక్కడ పెచ్చులు ఊడుతున్నాయి. ప్రధాన విభాగాలన్నీ పాత భవనంలోనే కొనసాగుతుండటం, నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నా ముందుకు సాగకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కార్యాలయాలను నూతన భవనంలోకి మార్చాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ కలెక్టరేట్ కూలిన ఘటనతో కరీంనగర్ కలెక్టరేట్ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
News September 15, 2025
కరీంనగర్: 24/7 తాగునీరు రావట్లే..!

ప్రజారోగ్య శాఖ అధికారుల అలసత్వంతో కరీంనగర్ పట్టణ ప్రజలకు 24/7 తాగునీరు అందడం లేదు. ఎల్ఎండీలో 23 టీఎంసీల నీరున్నా తాగునీటి సరఫరా ఎందుకు చేయడం లేదని నగరవాసులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి గంట మాత్రమే మంచినీటి సరఫరా జరుగుతోంది. పట్టణంలో 13వేల నల్లా కనెక్షన్లు ఉండగా 60వేల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అమృత్- 2 పథకంలో భాగంగా పట్టణమంతటా పైప్లైన్ల నిర్మాణం పూర్తయింది.
News September 14, 2025
కరీంనగర్ పీఏసీఎస్ లో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు డిఏఓ తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడోద్దన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. జిల్లాకు అవసరమైన యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.