News September 12, 2024
కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగట్ ఆస్తులివే..

కాంగ్రెస్ జులనా అభ్యర్థి <<14076884>>వినేశ్ ఫొగట్<<>> తన వద్ద వోల్వో XC 60 (Rs 35L), హ్యుండాయ్ క్రెటా, ఇన్నోవా కార్లు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇన్నోవా కోసం ఆమె రూ.13 లక్షల లోన్ తీసుకొని EMIలు చెల్లిస్తున్నారు. సోనిపత్‌లో రూ.2 కోట్ల విలువైన ప్లాట్ ఉంది. చేతిలో రూ.1.95 లక్షల నగదు ఉంది. గత FYలో రూ.13,85,000 ఆదాయం వచ్చినట్టు ఐటీ రిటర్నుల్లో పేర్కొన్నారు. ఆమె భర్త సోంవీర్ వద్ద మహీంద్రా స్కార్పియో ఉంది.
Similar News
News November 5, 2025
రిహ్యాబిలిటేషన్ సెంటర్‌లో చేరిన స్టార్ క్రికెటర్

T20 WC ఆఫ్రికా క్వాలిఫయర్స్‌కు స్టార్ బ్యాటర్ షాన్ విలియమ్స్ అందుబాటులో ఉండరని జింబాంబ్వే క్రికెట్ ప్రకటించింది. యాంటీ డోపింగ్, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతని సెంట్రల్ కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయట్లేదని తెలిపింది. అతను డ్రగ్ అడిక్షన్‌తో ఇబ్బంది పడుతూ రిహ్యాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లినట్లు ఒప్పుకున్నారని తెలిపింది. విలియమ్స్ అన్ని ఫార్మాట్లలో కలిపి 56 హాఫ్ సెంచరీలు, 14 శతకాలు సహా 8968 రన్స్ చేశారు.
News November 5, 2025
గవర్నమెంట్ షట్ డౌన్‌లో US రికార్డ్

షార్ట్ టర్మ్ గవర్నమెంట్ ఫండింగ్ బిల్లు 14వసారీ US సెనేట్‌లో తిరస్కరణకు గురైంది. 60 ఓట్లు కావాల్సి ఉండగా.. 54-44 తేడాతో బిల్ పాస్ కాలేదు. US చరిత్రలో లాంగెస్ట్ షట్‌డౌన్(35 డేస్)గా రికార్డులకెక్కింది. ఇప్పటికే అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. షట్‌డౌన్ ఆరోవారంలోకి ప్రవేశిస్తే సిబ్బంది కొరత వల్ల కొన్ని ఎయిర్ స్పేస్ సెక్షన్స్ క్లోజ్ కూడా కావొచ్చని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
News November 5, 2025
సినీ ముచ్చట్లు

* చికిరి అంటే ఏంటో ఇవాళ ఉ.11.07కు తెలుసుకోండి: డైరెక్టర్ బుచ్చిబాబు
* అఖండ-2 మూవీ నుంచి ఇవాళ సా.6.03 గంటలకు మ్యాసీవ్ అప్డేట్ ఉంటుంది: తమన్
* ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఒక్కో సీన్‌కి స్క్రీన్ బద్దలైపోతుంది. చాలారోజుల తర్వాత సాంగ్స్‌లో కళ్యాణ్ గారు డాన్స్ ఇరగదీశారు: దేవీశ్రీ ప్రసాద్
*


