News September 12, 2024
నీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటకు రా: గాంధీ

TG: BRS MLA కౌశిక్ రెడ్డికి దమ్ము, ధైర్యముంటే ఇంటి నుంచి బయటకు రావాలని శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీ డిమాండ్ చేశారు. కౌశిక్ ఇంటి ముందు అనుచరులతో కలిసి ఆయన బైఠాయించారు. ‘నా ఇంటికి వచ్చి జెండా ఎగురవేస్తా అన్నావు. నువ్వు రాలేదు. నేనే నీ ఇంటికి వచ్చా. పోలీసులను అడ్డు పెట్టుకొని నువ్వు ఇంట్లో దాక్కున్నావు. తేల్చుకుందాం బయటకు రా. నువ్వు వచ్చే వరకూ ఇక్కడే ఉంటా’ అని గాంధీ తేల్చి చెప్పారు.
Similar News
News February 21, 2026
ట్రంప్ టారిఫ్‌ల రద్దు.. భారత్ రియాక్షన్ ఇదే

ట్రంప్ విధించిన టారిఫ్‌లను US సుప్రీంకోర్టు రద్దు చేయగా ట్రంప్ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో తొలిసారి భారత వాణిజ్య శాఖ రియాక్టైంది. US SC ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని చెప్పింది. ఆపై ట్రంప్ వ్యాఖ్యలు, ఆ దేశ యంత్రాంగం ప్రకటించిన కొన్ని చర్యల వల్ల భవిష్యత్తులో ఏ మేరకు ప్రభావం ఉంటుందనే దానిపై పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. ట్రంప్ ప్రపంచ దేశాలపై మళ్లీ 10% టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే.
News February 21, 2026
రోటీ చెయ్యడానికి ఓ బాక్సు

చపాతీ, పూరీలు ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఎంతో ఇష్టంగా తింటారు. వాటిని చేయడం ఒక పని అయితే, ఆ తర్వాత వంటగది గట్టు శుభ్రపరచడం మరో పెద్ద పని. అలాకాకుండా ఉండాలంటే ఈ రోటీ బాక్సును ట్రై చేయండి. దీంతో ఈజీగా చపాతీలు చేసుకోవచ్చు. కదలకుండా ఉండేందుకు నాన్‌స్లిప్ ప్యాడ్లు ఉంటాయి. చూడడానికి సూట్‌కేసులా ఉండే ఈ బాక్సును కిచెన్‌లో ఎక్కడైనా సర్దేయొచ్చు. ఇవి అన్ని ఆన్‌లైన్ సైట్లలోనూ అందుబాటులో ఉన్నాయి.
News February 21, 2026
షాకింగ్.. ఒకే పార్కులో 72 పులులు మృతి

థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేట్ పార్క్‌లో డెడ్లీ వైరస్ విజృంభించింది. దీంతో ఈనెల 8-19వ తేదీ మధ్య 72 పులులు మృత్యువాతపడ్డాయి. కనైన్ డిస్టెంపర్ వైరస్(CDV) కారణంగానే అవి చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంటువ్యాధి సోకగానే జ్వరం, కళ్ల నుంచి నీరు కారుతుంది. వాంతులు, విరేచనాలు వస్తాయి. కండరాలు బలహీనమై మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. ముందస్తు టీకాతో నివారించవచ్చు. ఇది మనుషులకు సోకదు.


