News September 12, 2024

వ్యాపారం వైపే మొగ్గుచూపుతున్న Z జనరేషన్!

image

ఉద్యోగులుగా కాదు ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఉండాలని Gen Z యువత కోరుకుంటోంది. 1997-2012లో జన్మించిన వారిని జనరేషన్ Z అని పిలుస్తారు. 77% మంది తామే బాస్‌లుగా ఉండాలని, సొంత వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. వీరిలో 39% మంది స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించగలమని నమ్ముతున్నారు. ఆవిష్కరణ, సాంకేతికత, స్వాతంత్య్రమే భవిష్యత్తు అని ఈ తరం నిరూపిస్తోంది.

Similar News

News August 30, 2025

కాళేశ్వరం నివేదికపై హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్

image

కాళేశ్వరం నివేదికపై మాజీమంత్రి హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ‘వాస్తవాలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేం ప్రజలకు నిజాలను వివరిస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే ప్రభుత్వానికి ఎందుకు భయం? నిజాలు తేల్చాల్సింది కోర్టులు మాత్రమే’ అని పేర్కొన్నారు.

News August 30, 2025

చెంపదెబ్బ వీడియో.. శ్రీశాంత్ భార్య ఫైర్

image

IPL-2008లో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టిన <<17553113>>వీడియోను<<>> మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి ఇన్‌స్టా వేదికగా ఫైరయ్యారు. ‘లలిత్, మైకేల్ క్లార్క్ ఇలా చేయడం అమానుషం. చౌకబారు ప్రచారాలకు ఎప్పుడో జరిగిన విషయాన్ని లేవనెత్తడమేంటి? అసలు నిజాన్ని బయటపెట్టాలి. ఈ వీడియోతో ఆటగాళ్లు, కుటుంబాన్ని బాధపెట్టిన క్లార్క్, లలిత్‌పై కేసు పెట్టాలి’ అని మండిపడ్డారు.

News August 30, 2025

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

image

TG: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాప తీర్మానం అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఉదయం 9 గంటలకు సభ మొదలవనుంది. ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చకు అనుమతించనుంది. అయితే దీనికి మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.