News September 12, 2024

మదనపల్లె తహశీల్దార్ ఆఫీసులో సీఐడీ తనిఖీలు

image

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో దస్త్రాల దహనం ఘటనపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఇవాళ మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల బృందం తనిఖీలు చేపట్టింది. కోళ్లబైలు పరిధిలోని ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Similar News

News October 21, 2025

BMW కార్లకు లోక్‌పాల్ ఆర్డర్.. తీవ్ర విమర్శలు

image

దేశంలో అవినీతి నిర్మూలనకు ఏర్పడిన లోక్‌పాల్ వివాదంలో చిక్కుకుంది. 7 BMW-3 సిరీస్ కార్ల కొనుగోలుకు సిద్ధమవడమే ఇందుకు కారణం. ఒక్కో కారు విలువ రూ.70 లక్షలు కాగా వీటి కోసం పబ్లిక్ టెండర్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ‘మోదీ ప్రభుత్వం లోక్‌పాల్‌ను భూస్థాపితం చేసి ఇటీవల తమ సేవకులను నియమించింది. ఇప్పుడు వారి జల్సాల కోసం ఏం చేసినా పట్టించుకోవట్లేదు’ అని సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ విమర్శించారు.

News October 21, 2025

టీచర్లకు షాక్… TET మినహాయింపునకు NCTE తిరస్కరణ

image

దేశవ్యాప్తంగా ఇప్పటికే సర్వీసులో ఉన్న ప్రభుత్వ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వినతిని NCTE తిరస్కరించింది. 5 ఏళ్లకు మించి సర్వీసు ఉన్నవారంతా 2 ఏళ్లలో <<17587484>>టెట్<<>> పాసవ్వాల్సిందేనని ఇటీవల SC తీర్పిచ్చింది. 2017 పార్లమెంటు తీర్మానం ప్రకారం ఈ తీర్పిచ్చినందున అంతకు ముందు నియమితులైన వారికి వర్తింపచేయరాదని వారు కోరారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో NCTE తిరస్కరించింది.

News October 21, 2025

రోహిత్, జైస్వాల్, అభిషేక్.. గిల్‌కి జోడీ ఎవరు?

image

మరో రెండేళ్ల(2027)లో మెన్స్ వన్డే CWC రానుంది. ఇప్పటి నుంచే ఆ టోర్నీలో ఓపెనింగ్ జోడీపై SMలో చర్చ మొదలైంది. T20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేలకే పరిమితమయ్యారు. అప్పటివరకు ఆయన కొనసాగుతారా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. అయితే జైస్వాల్-గిల్ జోడీ అయితే బెటరని కొందరు, అభిషేక్-గిల్ అని మరికొందరు, రోహిత్-గిల్ బెస్ట్ అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఏ జోడీ అయితే బెటర్? COMMENT