News September 12, 2024

ఆరుగురు డాక్టర్లతో ఆదిమూలం బాధితురాలికి పరీక్షలు

image

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలకి తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులతో పరీక్షలు చేశారు. ఎక్స్‌రే తీశారు. రక్త, వీడిఆర్ఎల్ పరీక్షలు చేసి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు మెటర్నిటీ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి తెలిపారు. వైద్య పరీక్షలను రెండు సార్లు వాయిదా వేసినా.. మూడోసారి బాధితురాలు పరీక్షలకు హాజరయ్యారు.

Similar News

News January 15, 2026

చిత్తూరు జిల్లాలో రేపటి నుంచి ఈ-ఆఫీస్

image

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి ఈ-ఆఫీస్ విధానం అమలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 98 ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలనకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. పనులు వేగవంతంగా పారదర్శకంగా జరిగేలా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News January 14, 2026

టీచర్లకు చిత్తూరు DEO కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలో విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎంఈవోలు, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సిందేనని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఈనెల 13న 286 మంది విద్యాశాఖ ఉద్యోగులు ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉందన్నారు. 189 మంది మాత్రమే నమోదు చేశారని.. మిగిలిన వారు వేయలేదని చెప్పారు. వేయని వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

News January 14, 2026

CTR: భారీగా పడిపోయిన టమాటా ధరలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు క్రమంగా పడిపోతున్నాయి. పుంగనూరులో మొదటి రకం 10 కిలోల బాక్స్ బుధవారం గరిష్ఠంగా రూ.194, కనిష్ఠంగా రూ.140 పలికింది. పలమనేరులో గరిష్ఠ ధర రూ.220, కనిష్ఠ ధర రూ.170, వి.కోటలో గరిష్ఠ ధర రూ.200, కనిష్ఠ ధర రూ.140, ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.230, కనిష్ఠ ధర రూ.120గా నమోదైంది.