News September 12, 2024

BREAKING: సీతారాం ఏచూరి కన్నుమూత

image

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్ను మూశారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 1992 నుంచి ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.

Similar News

News October 27, 2025

గంటకు 18కి.మీ వేగంతో దూసుకొస్తున్న తుఫాను

image

AP: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ‘మొంథా’ తుఫానుగా బలపడి తీరం వైపు దూసుకొస్తోందని APSDMA తెలిపింది. గడిచిన 3 గంటల్లో గంటకు 18కి.మీ వేగంతో కదిలిందని చెప్పింది. ప్రస్తుతానికి చెన్నైకి 600KM, విశాఖపట్నానికి 710KM, కాకినాడకు 680KM దూరంలో కేంద్రీకృతమైందని వివరించింది. తీరం వెంబడి గంటకు 90-110KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

News October 27, 2025

నేల లోపల గట్టి పొరలుంటే ఏమి చేయాలి?

image

కొన్ని నేలల్లో లోపల గట్టి పొరల వల్ల సాగు సమస్యగా మారి దిగుబడి ఆశించినంతగా రాదు. ఇలాంటి భూముల్లో ఉపరితలం నుంచి మీటరు వెడల్పున గుంత తవ్వుతూ వెళ్తే కొంత లోతున గట్టి పొరలు కనబడతాయి. గట్టి పొరకు పైన, కింద మామూలు మట్టి ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్న భూముల్లో పెద్ద ట్రాక్టరుతో లోతు దుక్కులు చేసుకోవాలి. దీంతో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 2 టన్నుల జిప్సం వేస్తే 10 నుంచి 12 శాతం అధిక దిగుబడి పొందవచ్చు.

News October 27, 2025

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఉద్యోగాలు

image

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ 7 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సైంటిస్ట్-B, సైంటిస్ట్-C పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు DEC 8 వరకు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సైంటిస్ట్-B పోస్టుకు గరిష్ఠ వయసు 40ఏళ్లు, సైంటిస్ట్ -C పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: serb.gov.in/