News September 12, 2024

రెండు రోజులు వైన్స్ బంద్

image

TG: గణపతి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 17 ఉ.6 గంటల నుంచి 18 సా.6 వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆ రెండు రోజులు వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులిచ్చారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఇది వర్తించదని పేర్కొన్నారు.

Similar News

News October 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 42 సమాధానాలు

image

1. వాలి ఇంద్రుడి అంశతో జన్మించాడు.
2. కర్ణుడి అంత్యక్రియలను యుధిష్ఠిరుడు నిర్వహించాడు.
3. జ్ఞానానికి, విద్యకు అధిదేవత సరస్వతీ దేవి.
4. త్రిమూర్తులలో లయకారుడు ‘శివుడు’.
5. వాయు లింగం శ్రీకాళహస్తి ఆలయంలో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 21, 2025

మీ జుట్టు పొడిబారిందా? ఇలా చేయండి

image

థైరాయిడ్, PCOS, డయాబెటిస్ వల్ల చర్మం, జుట్టూ పొడిబారుతుంది. దీన్ని నివారించడానికి గాఢత తక్కువగా ఉండే షాంపూలను వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ‘సల్ఫేట్ ఫ్రీ ఫార్ములా ఉన్న మాయిశ్చరైజింగ్ షాంపూలను ఎంపిక చేసుకోవాలి. ప్రొడక్టుల్లో హైలురనిక్ యాసిడ్, స్క్వాలిన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. చుండ్రు నివారణకు కీటోకొనజాల్, సెలీనియం సల్ఫైడ్, సాల్సిలిక్ యాసిడ్ ఉన్న లోషన్లను వాడాలి’ అని చెబుతున్నారు.

News October 21, 2025

‘స్పర్శే ఔషధం’.. పిల్లలను తాకితే!

image

శిశువును తల్లిదండ్రులు తమ ఛాతిపై పడుకోబెట్టుకుంటే బంధం పెరగడమే కాక మెదడు ఆరోగ్యానికి గొప్ప ఔషధంగా పనిచేస్తుందని న్యూరాలజిస్టులు తెలిపారు. ఈ స్పర్శ ద్వారా ముందస్తు శిశువుల మెదడులో భావోద్వేగం, దృష్టికి మద్దతిచ్చే కనెక్షన్లు బలంగా మారుతున్నట్లు MRI స్కాన్‌లలో తేలినట్లు వెల్లడించారు. శిశువులలో రోజూవారీ 30-60 నిమిషాల స్పర్శ చాలా మార్పు తీసుకొస్తుందని, ఈ పద్ధతి చాలా సురక్షితమని పేర్కొన్నారు.