News September 12, 2024

సీతారాం ఏచూరితో సంభాషణలు మిస్సవుతా: రాహుల్ గాంధీ

image

అనారోగ్యంతో కన్నుమూసిన కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరికి రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబం, స్నేహితులు, అనుచరులకు సానుభూతి వ్యక్తం చేశారు. ‘సీతారాం ఏచూరి ఓ స్నేహితుడు. భారత్ అన్న ఆలోచనకు రక్షకుడు. దేశంపై ఆయనకు మంచి అవగాహన ఉంది. తరచూ మా మధ్య జరిగే సంభాషణలను ఇకపై నేను మిస్సవుతాను’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలూ ఏచూరి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 3, 2025

ఇండిగోలో సిబ్బంది కొరత.. పలు ఫ్లైట్లు ఆలస్యం, రద్దు

image

సిబ్బంది కొరతతో పలు ఇండిగో విమాన సర్వీసులు లేట్‌గా నడుస్తుండగా, కొన్ని రద్దవుతున్నాయి. మంగళవారం 35% ఫ్లైట్లు మాత్రమే సమయానికి నడిచినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన 200 సర్వీసులు రద్దయ్యాయి. నవంబర్‌లో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇండిగోలో పైలట్లు, ఫ్లైట్ సిబ్బంది కొరత ఎదుర్కొంటోంది.

News December 3, 2025

రూ.3.30 నుంచి రూ.90 వరకు.. రూపాయి పతనం ఇలా!

image

స్వాతంత్య్రం(1947) వచ్చేనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.3.30 ఉండేది. 30 సంవత్సరాల తర్వాత..
☛ 1977లో అది రూ.8.434కు చేరింది
☛ తరువాతి 30 ఏళ్ల(2007)కు 43.595గా ఉంది
☛ 2020లో రూ.73.23, 2021లో రూ.74.56, 2022లో రూ.82.76, 2023లో 83.4
☛ 2024లో 83.28కు బలహీనపడింది
☛ తాజాగా 2025 డిసెంబర్ నాటికి 90 రూపాయలకు పతనమైంది.

News December 3, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో జరిగిన భారీ <<18458130>>ఎన్‌కౌంటర్‌లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించగా ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.