News September 12, 2024
విశాఖ: తిరుపతి శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. వచ్చేనెల 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు తిరుపతిలో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.47కు శ్రీకాకుళం చేరుకుంటుందన్నారు. శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతికి అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు.
Similar News
News December 30, 2024
విశాఖ: పలు రైళ్లకు జనవరి 1 నుంచి నంబర్ల మార్పు
తూర్పు కోస్తా రైల్వే పరిధిలో 7 రైళ్ల నంబర్లలో మార్పులు చేశారు. కటక్-గుణుపూర్ ప్యాసింజర్‌కు(68433/34),విశాఖ-కిరండూల్ ప్యాసింజర్‌కు (58501/02),విశాఖ-రాయ్‌పూర్ ప్యాసింజర్‌కు (58528/27), విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్‌కు (58538/37), విశాఖ- బ్రహ్మపూర్ (58532/31), విశాఖ-గుణుపూర్ (58506/05), విశాఖ-భవానీపట్నం (58504/03) నంబర్లను కేటాయించారు. జనవరి 1నుంచి అమలులోకి రానున్నాయి.
News December 30, 2024
విశాఖ: తొలి రోజు 233 మంది హాజరు
పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి విశాఖ అభ్యర్థులకు సోమవారం నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కైలాసగిరి పోలీస్ మైదానంలో ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు 600 మంది హాజరు కావాల్సి ఉండగా 233 మంది మాత్రమే బయోమెట్రిక్‌కు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తీరును డీఐజీ గోపీనాథ్ రెడ్డి, ఎస్పీ తూహిన్ సిన్హా పరిశీలించారు.
News December 30, 2024
పాడేరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హేమలతాదేవి తెలిపారు. పారామెడికల్, సపోర్టింగ్ స్టాఫ్ విభాగంలో 29 క్యాటగిరీలలో మొత్తం 244 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అభ్యర్థులు ఈనెల 31నుంచి జనవరి 10లోగా ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. >Share it