News September 12, 2024

‘ఉరవకొండ’ పేరు వెనుక ఇదీ చరిత్ర!

image

ఉరవకొండ పేరు వినగానే కొండ గుర్తుకొస్తుంది. పట్టణంలోని ఈ కొండకు ఘన చరిత్రే ఉంది. పాముపడగ ఆకారంలో కొండ ఉండటంతో పూర్వం ఈ పట్టణాన్ని ఉరగాద్రి అని పిలిచే వారట. సంస్కృతంలో ఉరగ అంటే పాము పడగ, అద్రి అంటే కొండ అని అర్థం. కాలక్రమేణా ఉరవకొండగా మారింది. చిక్కన్న అనే పాలేగాడు ఇక్కడ కోట బురుజు నిర్మించుకుని, కొంతకాలం సామంత పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పట్టణం కొండ చుట్టూ అభివృద్ధి చెందుతుండటం విశేషం.

Similar News

News January 8, 2026

అనంతపురం జిల్లాలో 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

అనంతపురం జిల్లాలోని KGBVల్లో 60 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 40, టైప్-4 కేజీబీవీల్లో 20 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: జనవరి 11 వరకు..
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.

News January 7, 2026

రీసర్వే పనులు వేగవంతం చేయాలి: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో రీసర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీసర్వే, ఆర్‌ఓఆర్, మీసేవ, భూసేకరణ అంశాలపై సమీక్షించారు. డీఎల్‌ఆర్ పెండింగ్ గ్రామాల్లో ప్రతిరోజు ఒక గ్రామం డేటా పంపాలని సూచించారు. రైతులకు ముందస్తు నోటీసులు ఇచ్చి గ్రౌండ్ సర్వే పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News January 6, 2026

ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అన్ని శాఖల అధికారులు ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, ఉపాధి హామీ పనుల్లో శ్రామికుల హాజరు పెంచాలని, ఫారం పాండ్లు, కంపోస్ట్ పిట్‌లు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గోకులం షెడ్లను జనవరి 15 నాటికి ప్రారంభించి, మార్చి 10లోగా పూర్తి చేయాలన్నారు.