News September 12, 2024

CTR: వినాయకుడికి ముస్లిం సోదరుల పూజలు

image

చిత్తూరు జిల్లాలో ముస్లిం సోదరులు వినాయకుడికి పూజలు నిర్వహించి వారెవ్వా అనిపించారు. పులిచెర్ల మండలం కె.కొత్తకోటకు చెందిన ముస్లిం సోదరులు షేక్ ఫిరోజ్ బాషా, షేక్ చాంద్ బాషా గ్రామంలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానికంగా ఏడు దేవతామూర్తులు ఉన్న గుడిలో గణనాథుడికి పూజలు నిర్వహించారు. ఇలా మతసామరస్యం చాటిన ఆ సోదరులను అందరూ అభినందిస్తున్నారు.

Similar News

News February 27, 2026

చిత్తూరు: ‘తక్షణమే రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వాలి’

image

కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం మైక్రో ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించారు. అర్హత కలిగిన రైతులందరికీ తక్షణమే సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు వాటా చెల్లించిన వారికి వెంటనే మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందజేయాలని ఆయన సూచించారు. డ్రిప్ పరికరాలు మంజూరైన 1386 మందికి మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. మెటీరియల్ అందుకున్న రైతులకు ఇన్స్టాలేషన్ చేయాలన్నారు.

News February 27, 2026

74% మ్యాపింగ్ పూర్తి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో 74% ఓటర్ల జాబితా మ్యాపింగ్ పూర్తి అయినట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆరు నెలల్లో ఓట్ల జాబితాలో తొలగించిన వివరాలను రాజకీయ పార్టీలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు.

News February 27, 2026

CTR: వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే రేషన్

image

చిత్తూరు జిల్లాలో 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులతో పాటు అనారోగ్యంతో బాధపడే కార్డుదారులు 46,919 మంది ఉన్నారు. వీరందరికీ గురువారం నుంచే చౌక దుకాణాల డీలర్లు వారి ఇళ్ల వద్దే రేషన్ సరకులు పంపిణీ ప్రారంభించినట్లు డీఎస్వో శంకరన్ తెలి పారు. మార్చి ఒకటి నుంచి సాధారణ కార్డుదారులకు చౌకదుకాణాల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు సరకుల పంపిణీ ఉంటుందన్నారు.