News September 12, 2024
ఏలూరు: ముద్దాయికి జైలు శిక్ష.. జరిమానా

ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ వాసుదేవ్ ఏలూరు 1- Town పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి, ముద్దాయి బడిగంటల లీల రాజు 3 సం.ల 15 రోజులు సాధారణ జైలు శిక్ష, రూ.6500 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హేమలత వాదనలను వినిపించి ముద్దాయికి శిక్ష పడటంలో సహకరించారన్నారు.
Similar News
News March 19, 2026
భీమవరం కలెక్టరేట్‌లో వేడుకగా ‘ఉగాది’

భీమవరం కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కవులను, పండితులను ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
News March 19, 2026
తణుకు: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

తణుకు పట్టణం శివారు పాత బెల్లం మార్కెట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకు ఆకుల వారి వీధికి చెందిన పుదుకూడి కార్తీక్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
News March 19, 2026
భీమవరం: ఈనెల 19న కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

భీమవరంలోని కలెక్టరేట్‌లో గురువారం ఉదయం 10 గంటల నుంచి ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ఈమని సోమయాజులు ఘనాపాటి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, మహా ఆశీర్వచనం, కవి సమ్మేళనం ఉంటాయని పేర్కొన్నారు. ఇదే వేదికపై ప్రముఖ కవులు తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి, డాక్టర్ గొర్తి వెంకట సుబ్రహ్మణ్యం శర్మ, డాక్టర్ పెంకి విజయ్ కుమార్లను ఘనంగా సత్కరించనున్నట్లు ఆమె వెల్లడించారు.


