News September 12, 2024

గణేష్ నిమజ్జనానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు: CP

image

ఖమ్మం: గణేష్ నిమజ్జన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఖచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సునీల్ దత్ తెలిపారు. గణేష్ నిమజ్జనం, బందోబస్తు ఏర్పాట్లపై గురువారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ చిన్న సంఘటనకు అస్కారం లేకుండా భక్తులు, సందర్శకులు క్షేమంగా తిరిగి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని, అటు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

Similar News

News March 5, 2026

జిమ్‌లో వ్యాయామం చేస్తూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

image

ఖమ్మం జిల్లాకు చెందిన నాగండ్ల అనిల్ చౌదరి (36) హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్ నం.36లోని ఎస్బో జిమ్‌లో ఈ నెల 3 మధ్యాహ్నం వ్యాయామం పూర్తి చేసుకున్న అనిల్ చౌదరి వాష్ రూమ్‌కు వెళ్లిన సమయంలో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News March 5, 2026

ఖమ్మం:కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు

image

ఖమ్మం జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం మారి రెండేళ్లు గడుస్తున్నా, సుమారు 17 వేల మంది అర్హులు ఆశగా వేచి చూస్తున్నారు. గత మూడేళ్లుగా కొత్త దరఖాస్తులపై స్పందన లేకపోవడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనైనా తమకు ‘చేయూత’ లభిస్తుందని బాధితులు ఆశీస్తున్నారు

News March 5, 2026

ఖమ్మం: సర్కారు దవాఖానలో ‘దాహ’ మంటలు..

image

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాగునీటి ఎద్దడి రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చే వందలాది మంది రోగులు, వారి సహాయకులకు కనీసం మంచినీరు కూడా అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండలు ముదురుతుండటంతో బయట నీళ్ల బాటిళ్లు కొనలేక పేదలు అవస్థలు పడుతున్నారు. గతంలో దాతలు ఏర్పాటు చేసిన ఆర్‌ఓ (RO) ప్లాంట్ ప్రస్తుతం నిరుపయోగంగా మారడంతో ఈ దుస్థితి నెలకొంది.