News September 12, 2024

బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న ‘స్త్రీ 2’ కలెక్షన్లు

image

‘స్త్రీ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కొనసాగిస్తోంది. గత నెల 15న విడుదలై, నేటికీ స్టార్ హీరోల సినిమాలతో సమానంగా రన్ అవుతోంది. నిన్న రూ.3.04 కోట్లు కలెక్ట్ చేయడంతో ఆ సినిమా భారత్‌లో వసూలు చేసిన మొత్తం రూ.561.28 కోట్లకు చేరింది. ఈ వీకెండ్‌కి ఈ అంకె మరింత పెరగొచ్చని అంచనా. స్త్రీ మూవీకి సీక్వెల్‌గా శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో ‘స్త్రీ 2’ తెరకెక్కింది.

Similar News

News August 28, 2025

వరద ప్రభావిత జిల్లాల్లో నేడు సీఎం ఏరియల్ వ్యూ

image

TG: భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నట్లు సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పొంగుతున్న నదులు, వాగుల వైపు ప్రజలు వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

News August 28, 2025

యూఎస్ టారిఫ్స్ భారత్‌కు మేల్కొలుపు: రఘురామ్ రాజన్

image

యూఎస్ టారిఫ్స్ భారత్‌కు మేల్కొలుపు వంటిదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఫైనాన్స్ అనేవి ఇప్పుడు ఆయుధాలుగా మారుతున్నాయని ఇండియా టుడేతో చెప్పారు. అంతర్జాతీయంగా భారత్ ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. యువతకు ఉపాధిని కల్పించేందుకు, అవసరమైన వృద్ధి రేటు 8-8.5% సాధించడంలో సంస్కరణలను ఆవిష్కరించాలన్నారు.

News August 28, 2025

భారీ వర్షాలు.. పలు రైళ్ల రద్దు

image

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ కాచిగూడ-నాగర్సోల్, కాచిగూడ-కరీంనగర్, కరీంనగర్-కాచిగూడ, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, కాచిగూడ-నర్ఖేడ్, నాందేడ్-మేడ్చల్ ట్రైన్లను, రేపు నర్ఖేడ్-కాచిగూడ, నాగర్సోల్-కాచిగూడ రైళ్ల సేవలు రద్దు చేసినట్లు పేర్కొంది. పలు రైళ్లు దారి మళ్లింపు, పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వివరించింది.