News September 13, 2024
ప్రమాదాలకు నిలయంగా భాకరాపేట ఘాట్..?

భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. నెలలో కనీసం రెండు, మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాదికి 30 నుంచి 50 మంది వరకు ఈ రహదారిలో ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదాలు జరిగినపుడు పోలీసులు, రవాణ శాఖ అధికారులు వెళ్లి పరిశీలించడం మినహా.. ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న టమాటా లోడ్ కంటైనర్ ఢీకొనడంతో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News January 13, 2026
ప్రభుత్వం పనితీరుపై చిత్తూరు ప్రజల స్పందన ఇదే..!

ప్రభుత్వ సేవలు అందడంలో చిత్తూరు జిల్లాలో 66% మందే సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పింఛన్ల పంపిణీపై 85.4, అన్న క్యాంటీన్లపై 84.4, దీపం పథకంపై 66.2, ఆర్టీసీ బస్సులపై 70.9, వైద్య సేవలపై 62.4, రిజిస్ట్రేషన్ సేవలపై 64.2, హౌసింగ్ పథకంపై 52.9, రెవెన్యూ సేవలపై 45.5, రెవెన్యూ సర్వేపై 45.1 శాతం సంతృప్తి ఉందని వివరించారు.
News January 12, 2026
చిత్తూరు జిల్లాలో వ్యవసాయానికి ముప్పు.!

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలమట్టం తీవ్రంగా పడిపోతున్నట్లు CGWB నివేదిక సోమవారం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే లోతుకు చేరింది. అదేవిధంగా సోడియం కార్బొనేట్ (RSC) అవశేషాలు అధికంగా ఉండటంతో వ్యవసాయ భూముల సారం సైతం తగ్గుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో జిల్లాలో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని సూచించారు. దీంతో వ్యవసాయానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు.
News January 12, 2026
చిత్తూరులో ఘనంగా వివేకానంద జయంతి

చిత్తూరులోని వివేకానంద పార్కులో స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే తండ్రి చెన్నకేశవుల నాయుడు హాజరయ్యారు. ఆయన పలువురికి హిందూ సమ్మేళన పురస్కారాలను పంపిణీ చేశారు. వివేకానందుడు చూపిన మార్గం యువతకు ఆదర్శనీయమని కొనియాడారు.


