News September 13, 2024

స్వచ్ఛ భారత్ లక్ష్యం కోసం.. చిత్తశుద్ధితో పనిచేయాలి: కలెక్టర్

image

స్వచ్ఛ భారత్ లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పనిచేసి కడపను రాష్ట్రంలోనే ఆదర్శ స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌పై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం మున్సిపాలిటీలు, పంచాయతీలతో చేపడుతున్న పారిశుధ్య నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News January 12, 2026

‘ప్రజా సంక్షేమంలో నిర్లక్ష్యం వద్దు’

image

రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కడప కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

News January 12, 2026

కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా

image

కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా నియమితులు కానున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అతిథి సింగ్ బదిలీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీలలో భాగంగా జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా జిల్లాకు రానున్నారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్‌ల బదిలీలు చోటు చేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

News January 12, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

image

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.