News September 13, 2024

నన్ను హత్య చేసేందుకు యత్నించారు: కౌశిక్ రెడ్డి

image

TG: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తనను హత్య చేసేందుకు యత్నించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ‘నాపై దాడికి వస్తుంటే గాంధీకే పోలీసులు రక్షణ కల్పించారు. నాకు రక్షణ కల్పించలేదు. ఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే సామాన్యులకు ఏం కల్పిస్తారు? రాక్షస పాలనపై మేం పోరాడుతూనే ఉంటాం. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 29, 2026

నేటి సామెత: కసవు ఉంటేనే పశువు

image

‘కసవు’ అంటే గడ్డి లేదా పశుగ్రాసం. పశువుల దగ్గర మేత (గడ్డి) పుష్కలంగా ఉంటేనే ఆ పశువు ఆరోగ్యంగా ఉంటుంది, పాలిస్తుంది, వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుంది. మేత లేని పశువు నీరసించిపోతుంది. అందుకే పశువు మనకు ఉపయోగపడాలి అంటే, దానికి మనం సరైన ఆహారాన్ని అందించాలి. దానికి మనం ఇచ్చే దానిని బట్టే మనకు వచ్చే ఫలితం ఆధారపడి ఉంటుంది.”పెట్టుబడి లేనిదే లాభం రాదు” అనే విషయాన్ని ఈ సామెత తెలియజేస్తుంది.

News January 29, 2026

ఉపవాసం ఉంటూ ఇవి తింటున్నారా?

image

ఉపవాసం అంటే జీర్ణవ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం. అందుకే అతిగా తినకూడదు. సాత్విక ఆహారాన్ని అతి తక్కువగా తీసుకోవాలి. కానీ కొందరు ఉపవాసం పేరుతో అన్నాన్ని మాత్రమే వదిలి ఏది పడితే అది మితిమీరి తింటుంటారు. ఇలా తినడం వల్ల ఉపవాస పరమార్ధమే దెబ్బతింటుంది. అయితే ఉపవాసం ఉంటే.. నూనెలో వేయించిన చిప్స్, తియ్యటి పదార్థాలు తినకూడదు. ఏకాదశి నాడు ఉల్లి, వెల్లుల్లి, పప్పు ధాన్యాలు, కాఫీ, టీలకు దూరంగా ఉండాలి.

News January 29, 2026

ఆటోబయోగ్రఫీ రాస్తున్న సూపర్ స్టార్!

image

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆటో బయోగ్రఫీని రాస్తున్నారని ఆయన కూతురు సౌందర్య వెల్లడించారు. ఈ బుక్ విడుదలయ్యాక గ్లోబల్ సెన్సేషన్ అవుతుందన్నారు. షూటింగ్ టైమ్‌లోనూ ఆయన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ బుక్‌లో రాసుకునేవారని ‘కూలీ’ డైరెక్టర్ లోకేశ్ ఓ సందర్భంలో చెప్పారు. కాగా కండక్టర్ నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన రజినీ జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు ఈ ఆటోబయోగ్రఫీ ద్వారా వెల్లడయ్యే ఛాన్సుంది.