News September 13, 2024

బంగ్లాపై భారత్ సునాయాసంగా గెలుస్తుంది: దినేశ్ కార్తీక్

image

బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో భారత జట్టు సునాయాసంగా గెలుస్తుందని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ జోస్యం చెప్పారు. స్వదేశంలో భారత్‌ను పెద్ద జట్లు కూడా ఇబ్బంది పెట్టేలేకపోయాయన్నారు. ‘పాకిస్థాన్‌లో బంగ్లా బాగా ఆడింది. కాదనను. కానీ టీమ్ ఇండియాను వారు పెద్దగా ఇబ్బంది పెడతారని అనుకోవట్లేదు. ఇండియాలో ఇండియాను ఓడించడం చాలా కష్టం’ అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో ఈ నెల 19 నుంచి భారత్ 2 టెస్టులు ఆడనుంది.

Similar News

News August 28, 2025

ఆగస్టు 28: చరిత్రలో ఈ రోజు

image

1934: దక్షిణ భారత దేశపు నేపథ్య గాయని ఎ.పి.కోమల జననం
1949: నటి డబ్బింగ్ జానకి జననం
1959: సినీ నటుడు సుమన్ జననం(ఫొటోలో)
1983: శ్రీలంక మాజీ క్రికెటర్ లసిత్ మలింగ జననం
2006: నటుడు, దర్శకుడు డి.వి.నరసరాజు మరణం

News August 28, 2025

సంజూ ఏ స్థానంలోనైనా ఆడుతాడు: మెంటార్ గోమెజ్

image

ఆసియా కప్‌కు సంజూ శాంసన్ ఎంపికైనా గిల్ రావడంతో తుది జట్టులో స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి. గిల్ ఓపెనర్ కావడంతో శాంసన్‌ను తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి తెరదించుతూ సంజూ ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అతని మెంటార్ గోమెజ్ తెలిపారు. తన సామర్థ్యం ఏంటో శాంసన్‌కు తెలుసని, అతనిపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. కాగా కేరళ క్రికెట్ లీగ్‌లో సంజూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

News August 28, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.