News September 13, 2024
టెన్త్ విద్యార్థులకు శుభవార్త
AP: ప్రభుత్వ CBSE స్కూళ్లలో టెన్త్ చదువుతున్న 78వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఈసారి స్టేట్ బోర్డులోనే పరీక్షలు రాయించాలని నిర్ణయించింది. ఇటీవల అసెస్‌మెంట్ పరీక్షల్లో 90శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పబ్లిక్ పరీక్షలు కూడా CBSEలో రాసి ఫెయిలైతే విద్యార్థులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మానసికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News December 21, 2024
టీ, కాఫీ తాగే వారికి అలర్ట్!
రోజుకో కప్పు కాఫీ తాగితే ఆయుష్షు పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మగవారు రోజుకు 3-5 కప్పుల కాఫీ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, అంతకుమించితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కెఫిన్ రోజుకు 400mg వరకు మాత్రమే తీసుకోవాలి. టీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ ఉంటుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు 200mg కంటే ఎక్కువ తీసుకోకూడదు.
News December 21, 2024
ముదురుతున్న శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యల వ్యవహారం
BRS నేత <<14920837>>శ్రీనివాస్ గౌడ్<<>> వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. ఆయనపై కేసు నమోదు చేయాలని TTD భావిస్తోంది. ఈ మేరకు ఆయన వ్యాఖ్యలను విజిలెన్స్ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు విషయమై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 24న జరిగే TTD బోర్డు సమావేశంలో దీనిపై చర్చిస్తారని టాక్. తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
News December 21, 2024
పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు: అంబటి
AP: పథకాల్లో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘పెన్షన్లు 50% తగ్గించాలని చూస్తున్నారు. ప్రభుత్వం సంగతి 6 నెలల్లోనే ప్రజలకు తెలిసిపోయింది. కొందరు పార్టీలు పెట్టి మరో దాంట్లో కలిపేశారు. ఇంకొకరు పార్టీ పెట్టి మరొకరికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ జగన్ అలా కాదు. కష్టమైనా, నష్టమైనా, అన్యాయంగా జైల్లో పెట్టినా ప్రజల కోసం అన్నింటినీ ఎదుర్కొన్నారు’ అని చెప్పారు.