News September 13, 2024
ప.గో.: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

భార్యను హత్యచేసిన కేసులో భర్త అరెస్ట్ అయ్యాడు. ఆకివీడు CI జగదీశ్వరరావు వివరాలు.. ఉండి మండలం కలిగొట్లకు చెందిన సత్యవతి ఈ నెల 5న హత్యకు గురైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త చిరంజీవి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం గురువారం అరెస్ట్ చేసి భీమవరం కోర్టులో హాజరుపరచగా నిందితుడికి రిమాండ్ విధించారన్నారు.
Similar News
News July 4, 2025
మొగల్తూరు: కారు ఢీకొని రైతు మృతి

పేరుపాలెం నార్త్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు గుత్తుల పెద్దిరాజు మృతి చెందారు. పేరుపాలెం బీచ్ నుంచి భీమవరం వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ పక్కనే పచ్చగడ్డి కోస్తున్న పెద్దిరాజును కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న వారికి ఏమి కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
News July 4, 2025
తణుకులో అత్యధిక వర్షపాతం నమోదు

గడచిన 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 34.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తణుకు మండలంలో 12.2, ఆచంట 5.2, పెంటపాడు 4.2, పోడూరు 3.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, భీమవరం, వీరవాసరం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.
News May 7, 2025
జిల్లాలో ప్రస్తుతానికి ఎవరూ లేరు: ఎస్పీ

పశ్చిమగోదావరి జిల్లాలో పాకిస్థానీలు ప్రస్తుతానికి ఎవరూ లేరని జిల్లా అద్నాన్ నయీమ్ అస్మి శనివారం తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆదేశాలతో పాస్పోర్ట్, వీసాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు తనిఖీల్లో ప్రజల సహకరించాలని కలెక్టర్ నయీమ్ అస్మి విజ్ఞప్తి చేశారు.