News September 13, 2024
డీజీపీ జితేందర్ వార్నింగ్

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తే సహించేది లేదని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఎలాంటి ఆందోళనలకు అవకాశం లేదని, గొడవలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతలపై రాజీపడొద్దని సీపీలకు సూచించారు.
Similar News
News September 5, 2025
ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ గణపతి హోమం

TG: మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో గణపతి హోమం చేయిస్తున్నారు. తన సతీమణి శోభతో కలిసి పూజలో పాల్గొన్నారు. ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రుల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ 5 రోజులుగా ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారు. అటు హరీశ్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ రానున్నారు. నేరుగా ఫామ్‌హౌస్‌కు వెళ్లి కవిత ఆరోపణలపై చర్చించే అవకాశం ఉంది.
*File photo
News September 5, 2025
అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి.. ఓటు వేయండి!

AP: అమరావతిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు ప్రభుత్వం 5 కి.మీ. పొడవైన ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనుంది. ఇప్పటికే 4 ప్రత్యేక డిజైన్లు ఎంపిక చేసింది. వాటిలో ఒకదాన్ని ఫైనల్ చేసే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. <
News September 5, 2025
RCB ఎఫెక్ట్.. చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే..

RCB విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంపై ఇంకా పోలేదు. కర్ణాటక స్టేట్ క్రికెట్ లీగ్‌లో ఇది కూడా ఒక వేదిక. సేఫ్టీ దృష్ట్యా ఇక్కడ ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు నిర్వహించనున్నట్లు క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. సెమీ ఫైనల్, ఫైనల్ కూడా అభిమానులు లేకుండానే నిర్వహిస్తారని తెలిపింది. జూన్ 4న RCB విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట జరిగి 11మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.