News September 13, 2024
TGSRTC డిపో మేనేజర్లతో రీజనల్ మేనేజర్ సమీక్ష

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరి రామ్ గురువారం రీజనల్ కార్యాలయంలో అన్ని డిపోల మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వర్షాల వల్ల క్యాన్సిల్ అయిన బస్సుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే దసరా స్పెషల్ ఆపరేషన్ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్ని డిపోలో ట్రాఫిక్ ఇన్‌ఛార్జ్‌లు, గ్యారేజ్ ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.
Similar News
News March 4, 2026
మరణంలోనూ వెలుగులు నింపిన శ్రీవల్లి

ఖమ్మం ఎదులాపురం మున్సిపాలిటీకి చెందిన సోమంచి శ్రీవల్లి పుట్టుకతోనే మెదడు సంబంధిత సమస్యతో మంచానికే పరిమితమై, మంగళవారం మృతి చెందింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె తల్లిదండ్రులు చైతన్యవంతంగా ఆలోచించి, కుమార్తె నేత్రాలను ‘అన్నం ఫౌండేషన్’కు దానం చేశారు. శ్రీవల్లి కళ్లతో మరొకరికి చూపునివ్వాలన్న వారి నిర్ణయాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి సురేష్ అభినందించారు. ఈ దాతృత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
News March 3, 2026
రెండు గంజాయి కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష

ఖమ్మం: రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో నిందితుడికి ఒక్కొక్క కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె.ఉమాదేవి తీర్పు చెప్పారు. పెనుబల్లి మండలానికి చెందిన వ్యాపారి బోయిన వెంకటరమణ (62) పై 2024, 2025లో వియం బంజర పోలీసుల తనిఖీలలో గంజాయితో పట్టుబడ్డాడు. నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావటంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.
News March 3, 2026
వెలుగుమట్ల పార్కును సందర్శించిన డీఎఫ్ఓ

ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును జిల్లా అటవీ శాఖాధికారి (డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. వేసవిలో అడవులను కార్చిచ్చు నుంచి రక్షించుకోవడంపై సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ పరిశీలించారు. బ్లోయర్లు, ఇతర పరికరాలతో మంటలను ఎలా అదుపు చేయాలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అడవుల రక్షణకు వేగవంతమైన ప్రతిస్పందన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.


