News September 13, 2024

కివీస్VSఅఫ్గాన్.. ఒక్క బాల్ పడకుండానే చరిత్ర!

image

నోయిడాలో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా 5 రోజుల్లో ఒక్క రోజూ ఆట సాగలేదు. దీంతో ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దయిన మ్యాచ్‌గా ఇది రికార్డులకెక్కింది. ఇలా జరగడం గత 26 ఏళ్లలో ఇదే తొలిసారి అని క్రీడా వర్గాలు తెలిపాయి. చివరిగా 1998లో న్యూజిలాండ్, భారత్ మ్యాచ్ ఒక్క బాల్ పడకుండానే రద్దయింది.

Similar News

News October 24, 2025

బస్ ఎక్కకుండా ప్రాణాలు దక్కించుకున్నాడు

image

కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే బస్సులో TGకి చెందిన 15 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో తరుణ్ అనే యువకుడు మాత్రం చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన సీట్ నంబర్ U-2లో టికెట్ బుక్ చేసుకున్నారు. HYD ప్యారడైజ్ వద్ద బోర్డింగ్ చేయాల్సి ఉండగా బస్ ఎక్కకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయపడ్డారు. మిగతా 14 మందిలో 8 మంది మరణించారు.

News October 24, 2025

రేపే నాగుల చవితి.. పెళ్లి కానివారు ఇలా చేస్తే?

image

పెళ్లికాని యువతీయువకులకు నాగుల చవితి వివాహ యోగం కల్పిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఈ శుభ దినాన నాగ దేవతను ఆరాధించి, పుట్టలో పాలు పోస్తే.. జాతకంలోని రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయని అంటున్నారు. అలాగే వివాహ జీవితానికి ఆటంకం కలిగించే కుజ, కాల సర్ప దోషాలు తొలగి నాగ దేవత అనుగ్రహంతో తగిన జీవిత భాగస్వామి లభిస్తారని పేర్కొంటున్నారు. ☞ మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ వెళ్లండి.

News October 24, 2025

340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>)340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్ , బీఎస్సీ ఇంజినీరింగ్ అర్హతగలవారు నేటి నుంచి నవంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1180, SC, ST, PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/