News September 13, 2024

ఊరట ఓకే.. సీఎం ఆఫీస్, సెక్రటేరియట్‌‌కు వెళ్లలేని కేజ్రీవాల్

image

<<14090235>>బెయిల్‌పై<<>> బయటకొస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు పెట్టిన కండీషన్లే ఇక్కడా వర్తిస్తాయని చెప్పడమే ఇందుకు కారణం. దీంతో ఆయన సీఎం ఆఫీస్, సెక్రటేరియట్‌కు వెళ్లలేరు. ఈ కండీషన్లపై అభ్యంతరం ఉన్నా జుడీషియల్ డిసిప్లిన్, ట్రయల్ కోర్టు తీర్పును గౌరవిస్తూ వాటిపై వ్యతిరేక ఆదేశాలు ఇవ్వడం లేదని జస్టిస్ భూయాన్ అన్నారు.

Similar News

News November 1, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.1,23,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,12,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,66,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 1, 2025

టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు: చంద్రబాబు

image

AP: టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగుతామని పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని తెలిపారు. ఇకపై వారంలో తానొక రోజు, లోకేశ్ ఒకరోజు టీడీపీ ఆఫీసులో అందుబాటులో ఉంటామని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తే తమ ప్రభుత్వం గాడిలో పెట్టిందని పేర్కొన్నారు.

News November 1, 2025

నార్త్ యూరప్‌లో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్!

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.NTR హీరోగా నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో పునః ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. నార్త్ యూరప్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయాలని డైరెక్టర్ నీల్ ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.