News September 13, 2024

కౌశిక్‌ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలి: ఎమ్మెల్యే దానం

image

TG: BRS MLA కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హరీశ్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అన్నారు. ‘కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీ స్టాండా? వ్యక్తిగతమైతే కౌశిక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.

Similar News

News August 31, 2025

అంచనాలకు మించి దూసుకెళ్తున్న భారత్

image

భారత ఎకానమీ అంచనాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌(ఏప్రిల్-జూన్)లో <<17555786>>GDP<<>> వృద్ధి రేటు 7.8% నమోదవడమే ఇందుకు నిదర్శనం. మాన్యుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, సర్వీస్ సెక్టార్లు రాణించడం కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో అతిపెద్ద ఎకానమీగా ఉన్న భారత్ 2030 నాటికి మూడో స్థానానికి చేరుతుందని అధికారులు వెల్లడించారు. అప్పటివరకు జీడీపీ $7.3 ట్రిలియన్లకు చేరుతుందని తెలిపారు.

News August 31, 2025

రేపు రాజంపేటలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రాజంపేట మండలం, కె.బోయినపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేయనున్నారు. ప్రతి నెల 1న సీఎం వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ నేరుగా పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. రేపటి కార్యక్రమం అనంతరం సాయంత్రం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.

News August 31, 2025

భారత్‌పై మరో కుట్రకు తెరలేపిన ట్రంప్?

image

50% టారిఫ్స్ అమలు చేస్తూ భారత ఎకానమీని దెబ్బకొట్టాలని చూస్తున్న ట్రంప్ మరో కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. తమలాగే ఇండియాపై టారిఫ్స్ విధించాలని యూరోపియన్ దేశాలకు US సూచించినట్లు సమాచారం. IND నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోళ్లను కూడా పూర్తిగా నిలిపేయాలని చెప్పినట్లు తెలిసింది. ట్రేడ్ డీల్‌కు భారత్ ఒప్పుకోకపోవడం, రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకపోవడంతో ట్రంప్ అసహనానికి గురై ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం.