News September 13, 2024
భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.1300 పెరిగి రూ.74,450కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1200 పెరిగి రూ.68,250 పలుకుతోంది. ఇక వెండి ధర ఏకంగా కేజీ రూ.3,500 పెరిగి రూ.95వేలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చోట్ల దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News January 20, 2026
జనగామ: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు శుభవార్త

మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు జనగామ ప్రిస్టన్ గ్రౌండ్ నుంచి 130 స్పెషల్ బస్సులు ఉంటాయని డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. ఈనెల 25 నుంచి 31 వరకు ఆర్టీసీ బస్సులు మేడారం అమ్మవారి గద్దెల వరకు వెళతాయన్నారు. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకి మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుందని, ఈ సదావకాశాన్ని జనగామ పరిసర ప్రాంతాల భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
News January 20, 2026
ఇతిహాసాలు క్విజ్ – 129 సమాధానం

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి శూర్పణఖ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఏంటి?
సమాధానం: రావణుడి సోదరి అయిన శూర్పణఖ అసలు పేరు మీనాక్షి. చేప వంటి కళ్లు గలది అని దీనర్థం. అయితే ఆమె గోళ్లు పెద్దవిగా ఉండేవి. అలాగే పదునుగా కూడా ఉండేవి. అందువల్లే ఆమెను ‘శూర్పణఖ’ అని పిలవడం మొదలుపెట్టారు. శూర్పణఖ అంటే జల్లెడ వంటి గోళ్లు కలది అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 20, 2026
హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు వైరల్

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. నిండుగర్భంతో బ్లాక్ డ్రెస్సులో తాజాగా ఆమె దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురైన సోనమ్ 2018లో ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే వాయు అనే కుమారుడు ఉన్నారు. 2007లో ‘సావరియా’తో తెరంగేట్రం చేసిన ఆమె భాగ్ మిల్కా భాగ్, నీర్జా, పాడ్ మ్యాన్, ది జోయా ఫ్యాక్టర్ వంటి సినిమాల్లో నటించారు.


