News September 13, 2024
నిబంధనలు పెట్టకుండా నిధులివ్వండి: రేవంత్

TG: రాష్ట్రంలో సంభవించిన వరదల నష్టానికి ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయం కింద నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. సెక్రటేరియట్లో ఆయన కేంద్ర బృందంతో భేటీ అయ్యారు. వరదల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టి, నిధి ఏర్పాటు చేయాలన్నారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం తదితర అంశాలను కేంద్ర బృందం దృష్టికి సీఎం తీసుకెళ్లారు.
Similar News
News December 25, 2025
కదిరి: ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్

కదిరి మున్సిపాలిటీ పరిధిలో కుటాగుళ్ల-పులివెందుల క్రాస్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కదిరి రూరల్ పరిధిలోని కాళసముద్రంకు చెందిన రాజును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయిందన్నారు. అధికంగా రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
News December 25, 2025
బాబువన్నీ చిల్లర రాజకీయాలే: కాకాణి

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు కోటి సంతకాలు చేసినా CM లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని YCP నేత కాకాణి గోవర్ధన్ మండిపడ్డారు. ‘పేదలకు మేలు చేసేలా జగన్ వైద్యరంగాన్ని అభివృద్ధి చేశారు. వాటిని నీరుగార్చి ప్రైవేటుతో మేలుచేస్తానంటే ఎవరూ నమ్మరు. ఎన్నికకో పార్టీతో పొత్తు పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తూ నావి హుందా పాలిటిక్స్ అని CBN అనడం హాస్యాస్పదం’ అని ఎద్దేవా చేశారు.
News December 25, 2025
బైక్స్, కార్ల వెంట కుక్కల పరుగులు.. కారణమేంటి?

స్పీడ్‌గా వెళ్లే బైక్స్, కార్లను చూస్తే కుక్కల్లో వేటాడే స్వభావం బయటపడుతుంది. హారన్, ఇంజిన్, సైలెన్సర్ సౌండ్స్‌తో ఉద్రేకం పెరిగి వెంటపడతాయి. వాహనాల పొగ నుంచి వచ్చే స్మెల్ కూడా కారణం కావొచ్చు. కొన్ని వీధి కుక్కలు అవి తిరిగే రోడ్డును తమ ప్రాంతంగా భావిస్తాయి. అక్కడికి వచ్చిన వాహనాల వెంట పరిగెడతాయి. కుక్కలు అన్నీ ఒకేలా బిహేవ్ చేస్తాయని చెప్పలేం. కొన్ని మాత్రమే వాహనాల వెంట పరిగెడుతూ ఇబ్బంది పెడతాయి.


