News September 13, 2024
సన్‌గ్లాసెస్ ధరించి శ్రేయస్ బ్యాటింగ్.. 7 బంతుల్లో డకౌట్
అసలే సెలక్టర్లు కోపంతో ఉన్నారని వార్తలు. దీనికి తోడు ఫామ్‌లేమి. పైగా సన్‌గ్లాసెస్ ధరించి క్రీజులోకి వచ్చారు. ఓ మంచి ఇన్నింగ్స్ ఆడారా అంటే అదీ లేదు. జస్ట్ 7 బంతులాడి డకౌటయ్యారు. దులీప్ ట్రోఫీలో ఇండియా-డి తరఫున శ్రేయస్ అయ్యర్ తాజా ప్రదర్శన తీరిది. ఇంకేముందీ నెటిజన్లు రంగంలోకి దిగి ట్రోలింగ్ మొదలెట్టారు. సైట్ ఇష్యూస్ ఉంటే బ్యాటర్లు కాంటాక్ట్ లెన్సులు, కళ్లద్దాలు పెట్టుకుంటారు గానీ సన్‌గ్లాసెస్ కాదు.
Similar News
News December 21, 2024
మినీ ఇండియాలా కువైట్: ప్రధాని మోదీ
కువైట్‌ను చూస్తోంటే మినీ ఇండియాలా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విదేశంలో ఇంతమంది భారతీయులను చూడటం సంతోషంగా ఉందని చెప్పారు. ‘కువైట్ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించే చెబుతుంటారు. విదేశీ కరెన్సీ ఆర్జనలో భారత్ టాప్‌లో ఉంది. మీరంతా కష్టపడటం వల్లే ఇది సాధ్యమైంది. భారత్, కువైట్ మధ్య దౌత్య సంబంధాలే కాదు.. విడదీయలేని మైత్రి కూడా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
News December 21, 2024
సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: సీఎం
TG: ప్రతి పేదవాడికి సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని CM రేవంత్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ క్రిస్మస్ అని అన్నారు. ‘పేదలకు విద్య, వైద్యాన్ని క్రైస్తవ మిషనరీలు అందిస్తున్నాయి. ఇంకో మతాన్ని కించపరచకుండా ఎవరైనా మతప్రచారం చేసుకోవచ్చు. దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
News December 21, 2024
అనుమతి ఇస్తే ఇప్పుడే శ్రీతేజ్‌ను కలుస్తా: బన్నీ
TG: పోలీసులు ఇప్పుడు అనుమతి ఇస్తే వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను వెళ్లి పరామర్శిస్తానని అల్లు అర్జున్ చెప్పారు. కోర్టులో కేసు ఉండటం వల్ల కలవలేకపోతున్నానని చెప్పారు. అతను తన ఫ్యాన్ అని, కలవకుండా ఎందుకు ఉంటానన్నారు. శ్రీతేజ్‌ను పరామర్శించడానికి తాను వెళ్లలేకపోయినా తండ్రి అల్లు అరవింద్, తన టీం ఇతరులను బాలుడి వద్దకు పంపి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లు తెలిపారు.