News September 13, 2024
రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

TG: ఈ సారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులోపు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో ఏడాదికి రూ.15,000 అందించాల్సి ఉంది.
Similar News
News January 13, 2026
జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
News January 13, 2026
BMRCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్(<
News January 13, 2026
ఏ ముగ్గు ఏ ఫలితాన్నిస్తుంది?

నక్షత్రం ఆకారంలో ముగ్గు వేస్తే దుష్టశక్తులు దరిచేరవు. పద్మం ముగ్గు చెడు శక్తులను అరికడుతుంది. పూజ పీటల మీద, తులసి కోట వద్ద అష్టదళ పద్మం ముగ్గు వేసి రెండు గీతలు గీయాలి. ఇది అత్యంత శుభప్రదం. ఆలయాల్లో ముగ్గులు వేసే స్త్రీలకు సుమంగళి యోగం కలుగుతుందని నమ్మకం. అయితే స్వస్తిక్, ఓం వంటి పవిత్ర గుర్తులను నేలపై వేయరాదు. ముగ్గు లేని ఇల్లు అశుభానికి సంకేతం. అందుకే రోజూ వాకిలిని రంగవల్లికలతో అలంకరించుకోవాలి.


