News September 13, 2024
‘ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ జరగాలి’

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, సంబధిత అధికారులతో ఆమె సమీక్షించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సుమారు 5.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని అంచనా ఉండగా అందులో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు పటిష్ఠ ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News January 5, 2026
ప.గో: లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

పాలకొల్లుకు చెందిన ప్రేమికులు రమేశ్, భాగ్యశ్రీ ఆదివారం తాళ్లరేవు మండలం సుంకరపాలెంలోని ఓ లాడ్జిలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన యాజమాన్యం కోరంగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని చికిత్స కోసం యానం ఆసుపత్రికి తరలించారు. ఈ నెల ఒకటో తేదీన వారు గది తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2026
తాడేపల్లిగూడెం YCP ఇన్‌ఛార్జ్ ఎవరో?

తాడేపల్లిగూడెం YCP ఇన్‌ఛార్జ్ మార్పుపై సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రస్తుత ఇన్‌ఛార్జ్ కొట్టు సత్యనారాయణపై అసంతృప్తి నెలకొనడంతో కొత్తవారి కోసం పార్టీ హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇన్‌ఛార్జ్ రేసులో వడ్డి రఘురాం, కొట్టు నాగు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి పగ్గాలు అప్పగిస్తారు లేదా ఇద్దరికీ బాధ్యతలు పంచుతారా అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.
News January 4, 2026
ప.గో: అక్క అనే పిలుపునకు అండగా నిలిచి.. తలకొరివి పెట్టి మానవత్వం చాటి..

రక్త సంబంధం లేకపోయినా చిన్న పిలుపుతో ఏర్పడిన అనుబంధం మానవత్వాన్ని చాటింది. బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను(45) శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, బంధువులు ఎవరూ రాలేదు. దీంతో శ్రీను ‘అక్క’ అని పిలిచే పొరుగున ఉన్న పతివాడ మావూళ్లమ్మ చలించిపోయింది. తానే స్వయంగా తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఆమె చూపిన ఈ చొరవను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటూ, మావూళ్లమ్మ పెద్దమనసును అభినందించారు.


