News September 13, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.4 కోట్ల విరాళం

image

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థలు తమవంతు సహకారాన్ని అందించాయి. రూ.4 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం సచివాలయంలో చందబ్రాబును కలిసి అందించారు. భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావు, రామకృష్ణ తనయుడు సాకేత్ రామ్ చెక్కు అందజేసిన వారిలో ఉన్నారు.

Similar News

News February 27, 2026

వీధి కుక్కల నియంత్రణపై చర్యలు చేపట్టాలి: GNT కలెక్టర్

image

వీధి కుక్కలపై ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణపై గురువారం సమావేశం నిర్వహించారు. వీధి కుక్కల వలన చిన్న పిల్లలు ఆడుకోవాలన్నా భయపడుతున్నారని, పగలు, రాత్రి తేడా లేకుండా శునకాలు ప్రజలపై దాడి చేస్తున్నాయని వాటి నుంచి రక్షణ కల్పించాలని చెప్పారు.

News February 26, 2026

జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు: GNT కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతిలో 20 కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. గురువారం న్యూ ఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు.