News September 13, 2024

మదర్ డైరీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా

image

ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరుగురు అభ్యర్థులు పోటీ చేస్తే ఆరుగురు భారీ మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన వారిలో కల్లెపల్లి శ్రీశైలం, గుడిపాటి మధుసూదన్ రెడ్డి, పుష్పాల నర్సింహులు, బత్తుల నరేందర్ రెడ్డి, రుద్రాల నరసింహ రెడ్డి, మండలి జంగయ్య ఉన్నారు. గెలుపొందిన వారికి ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News January 21, 2026

నల్గొండ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ

image

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అందించే ఉచిత ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. 2025-26 సంవత్సరానికి గానూ బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ వంటి పోటీ పరీక్షలకు 5 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.

News January 21, 2026

NLG: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు భేష్

image

జిల్లాలో పౌర సరఫరాల శాఖ ద్వారా 2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిలో సాగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక కొనుగోలు విధానం రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి చెల్లింపులు జరగడం వల్ల రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై విశ్వాసం పెరిగింది. ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు.

News January 21, 2026

NLG: ఆరేళ్లు గడిచినా.. ఎన్నికల లెక్కలు చెప్పలే!

image

జిల్లాలో గత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన 548 మంది అభ్యర్థులు నేటికీ ఎన్నికల ఖర్చుల వివరాలు అధికారులకు సమర్పించలేదు. జిల్లాలోని నకిరేకల్ మినహా నల్గొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చండూర్, చిట్యాల మున్సిపాలిటీలో 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 707 మంది పోటీ చేశారు. వీరిలో 159 మంది మాత్రమే ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలను అధికారులకు సమర్పించారు.