News September 13, 2024
సంగం బ్యారేజ్ కి గౌతంరెడ్డి పేరు తొలగింపు

సంగం బ్యారేజ్ కి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో పెట్టిన పేరును కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక తొలగింపు చర్యలకు శ్రీకారం చుట్టింది. తాజాగా శుక్రవారం బ్యారేజ్ వద్ద బోర్డుపై ఏర్పాటు చేసిన మేకపాటి గౌతం రెడ్డి పేరును వైట్ వాస్ వేసి తొలగించారు. దీంతో పలువురు వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో పెట్టిన పేర్లను తొలగించాలని కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Similar News
News September 16, 2025
నెల్లూరు: జాడ తెలియని బై జ్యూస్ ట్యాబ్‌లు

2022-23, 2023-24లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు (20,830) ఉపాధ్యాయులకు (3,554) గత YCP ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చింది. బైజూస్‌తో ఒప్పందం కుదుర్చి కొంతమంది సబ్జెక్టులు అప్లోడ్ చేశారు. పాఠ్యాంశాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో డిజిటల్ బోధన ప్రభావం చూపలేదు. కొన్నాళ్లకే ట్యాబ్‌లు పనిచేయక విద్యార్థులు పక్కన పెట్టారు. కొందరు గేమ్స్, వినోదం కోసం వాడేశారు. ప్రస్తుతం ఆ ట్యాబ్‌లు ఎక్కడున్నాయో స్పష్టత లేదు.
News September 16, 2025
నెల్లూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతుల ఇబ్బందులు!

జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోతలు మొదలైపోయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర పుట్టి రూ.20,187 ఉండగా మిల్లర్లు రూ.13–15 వేలకే కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు పంటను దెబ్బతీయగా ధరలు పడిపోతాయనే ఆందోళన రైతుల్లో ఉంది. గతంలో పుట్టి రూ.24 వేలు ఉండగా, ఇప్పుడు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నామని రైతులు వాపోతున్నారు.
News September 16, 2025
నెల్లూరు: సాగు నీరు ముందుకెళ్లేది ఎలా?

అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. ప్రధాన ఆయకట్టు పంట కాలువల్లో గుర్రపు డెక్క పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో సాగు నీటికి ఆటంకంగా మారుతోంది. దీంతో సీజన్లో ఆయకట్టు పొలాలకు నీరు అందడం లేదు. జాఫర్ సాహెబ్ కాలువ, సర్వేపల్లి కెనాల్, కనుపూరు కెనాల్ పంట కాలువల్లో రబీ ఆరంభానికి ముందే పూడికతీత పనులు చేపట్టాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.