News September 13, 2024
నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారు: HC

TG: హైడ్రాను రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ <<14095771>>సందర్భంగా<<>> హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. జీవో 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమీన్‌పూర్‌లో ఈనెల 3న షెడ్లు కూల్చివేశారన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Similar News
News January 12, 2026
పోలవరం-నల్లమల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో TG ప్రభుత్వం పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. కాగా గోదావరి జలాల విషయంలో MH, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.
News January 12, 2026
ఇరాన్-USA: మైత్రి నుంచి మంటల వరకు..

షా మహమ్మద్ రెజా హయాంలో ఆయిల్-వెపన్స్ సేల్స్‌తో ఈ రెండూ ఫ్రెండ్లీ దేశాలు. రష్యాపై USA ఇక్కడి నుంచి నిఘా పెట్టేది. 1979లో ప్రజల తిరుగుబాటుతో షా USకు వెళ్లగా అప్పగింతకై నిరసనలు, US ఆస్తులపై దాడులు జరిగాయి. ఇస్లామిక్ ఉద్యమంతో మతపెద్ద అయతుల్లా పాలన, రిలేషన్ ఫాల్ మొదలయ్యాయి. 1980లో ఇరాన్-ఇరాక్ వార్‌లో USA ఇరాక్ వైపు ఉంది. 1989లో అలీ ఖమేనీకి పగ్గాలు, అణు పరీక్షలు, చైనాతో క్రూడ్ డీల్ గ్యాప్ పెంచాయి.
News January 12, 2026
లాభాల్లోకి స్టాక్ మార్కెట్స్

నష్టాలతో మొదలైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు కోల్పోయింది. అలాంటి పరిస్థితి నుంచి సెన్సెక్స్ 60కి పైగా పాయింట్లు లాభపడి 83,640 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 40కి పైగా పాయింట్లు ఎగబాకి 25,725 వద్ద కొనసాగుతోంది.


