News September 14, 2024
మంచిర్యాల, పెద్దపల్లిలోనూ వందేభారత్ ఆపాలని డిమాండ్

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. TGలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రాలైన మంచిర్యాల, పెద్దపల్లిలోనూ ఈ రైలును ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. మంగళవారం మినహా నాగ్‌పూర్‌లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుతుంది.
Similar News
News January 3, 2026
సభా సమరం.. కృష్ణా జలాలపై ఇవాళ చర్చ!

TG: కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో ఇవాళ షార్ట్ డిస్కషన్ జరగనుంది. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ 12PMకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 4 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్, పే స్ట్రక్చర్) సవరణ బిల్లు, రెండో సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, రెండో సవరణ బిల్లును సభ ముందుకు తీసుకురానుంది.
News January 3, 2026
ఇవాళ సూపర్ మూన్.. ఎన్ని గంటలకంటే?

ఇవాళ సూపర్ మూన్ కనువిందు చేయనుంది. పౌర్ణమి సందర్భంగా 6PM నుంచి కనిపించనుంది. సాధారణం కంటే 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగానే వీక్షించవచ్చు. ఆ సమయంలో ఎర్త్‌కు 3.6 లక్షల KM దూరంలో చందమామ ఉంటాడట. భూమికి దగ్గరగా చంద్రుడు రావడం, అదే టైమ్‌లో సూర్యుడికి భూమి దగ్గరగా ఉండటం, సూర్యుడికి చంద్రుడు పూర్తి ఎదురుగా రావడంతో సూపర్ మూన్ వెలిగిపోనుంది.
News January 3, 2026
కొడుకు, కోడలు క్యూట్ ఫొటో షేర్ చేసిన ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ కొడుకు రైహాన్ త్వరలో <<18710916>>పెళ్లి<<>> చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడుకు, కాబోయే కోడలు క్యూట్ ఫొటోలను ఆమె షేర్ చేశారు. వారిద్దరూ మూడేళ్ల వయసు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. ‘మీ ఇద్దరినీ ఎంతో ప్రేమిస్తున్నా. ఎల్లప్పుడూ ఒకరినొకరూ ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ఉండండి. మూడేళ్ల వయసు నుంచీ ఉన్నట్లే ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగండి ’ అని రాసుకొచ్చారు.


