News September 14, 2024

ఇవాళ్టి నుంచి ఆస్పత్రుల్లో OPలు బంద్

image

AP: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ కోటాను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ్టి నుంచి PHC వైద్యులు ఆస్పత్రుల్లో OP సేవలు బహిష్కరించనున్నారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తామని PHC వైద్యుల సంఘం తెలిపింది. నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. రేపు ఛలో విజయవాడ, సోమవారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపడతామని, మంగళవారం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తామని తెలిపింది.

Similar News

News August 31, 2025

సభకు కాళేశ్వరం నివేదిక.. సర్వత్రా ఉత్కంఠ

image

తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో తొలిసారి చర్చ జరగనుంది. ఇవాళ కాళేశ్వరంపై PC ఘోష్ రిపోర్ట్ సభలో బహిర్గతం కానుంది. కాళేశ్వరం అంతా తప్పేనని, డిజైన్ నుంచి పూర్తి నిర్మాణం వరకు KCR చెప్పినట్టే జరిగిందని GOVT విమర్శిస్తుంటే.. ఇంత గొప్ప ప్రాజెక్టే లేదని, దేశానికే రోల్ మోడల్ అని BRS వాదిస్తూ వచ్చింది. ఇవాళ సభకు <<17561158>>నివేదిక<<>> రానుండటంతో అందులో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News August 31, 2025

వచ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

image

AP: అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది పాలన, పథకాల అమలు, బనకచర్ల ప్రాజెక్టు తదితర అంశాలపై సభలో చర్చించే అవకాశముంది.

News August 31, 2025

అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్: నెట్‌వర్క్ ఆస్పత్రులు

image

TG: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయించాయి. రూ.1300 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ 1 నుంచి సేవల్ని నిలిపివేస్తామని ఇప్పటికే <<17479379>>ప్రభుత్వానికి లేఖ<<>> రాశామని, అయినా స్పందన రాలేదని ఆస్పత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి. బిల్లుల పెండింగ్‌‌తో చిన్న, మధ్యస్థాయి ఆస్పత్రులు మూసివేసే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.