News September 14, 2024
‘హైడ్రా’ కూల్చివేతలపై హైకోర్టుకు కాటసాని భార్య

TS అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చివేతలపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మ హైకోర్టును ఆశ్రయించారు. FTL పరిధిలో లేకున్నా వ్యవసాయ భూమిలోని షెడ్, కాంపౌండ్‌ను కూల్చివేశారని తెలిపారు. 9ఎకరాల భూమిలో దానిమ్మ, మామిడి, జామ వంటి మొక్కలు పెంచుతున్నామని, కాంపౌండ్ నిర్మాణానికి అనుమతివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా న్యాయమూర్తి నిరాకరించారు. అనంతరం విచారణను అక్టోబరు 3కు వాయిదా వేశారు.
Similar News
News October 7, 2025
కర్నూలులో ఆటో నడిపిన మంత్రి టీజీ భరత్

కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీహామీని నెరవేర్చుతోందని మంత్రి TG భరత్ అన్నారు. కర్నూలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు రూ.15 వేలు ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేసేందుకు తాను కృషి చేస్తున్నానన్నారు. అనంతరం ఆటో నడిపి డ్రైవర్లను ఉత్సాహపరిచారు.
News October 7, 2025
వాల్మీకి భవన్ నిర్మాణం కోసం రూ.కోటి ఇస్తా: మంత్రి టీజీ

వాల్మీకి భవన్ నిర్మాణం కోసం తన తరుఫున రూ.కోటి సహకారం అందిస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూల్లో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ఈ విరాళం ప్రకటించారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ తమ నాయకుడు సీఎం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి టీజీ భరత్ చెప్పారు.
News October 6, 2025
మట్టి మిద్దె కూలి ఐదేళ్ల బాలిక మృతి

మంత్రాలయం మండలం మాధవరంలో విషాదం చోటు చేసుకుంది. పాత మట్టి మిద్దె ఇల్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఐదేళ్ల బాలిక లలిత సోమవారం మృతిచెందింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు మట్టి గడ్డలను తొలగించి వారిని రక్షించారు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.