News September 14, 2024

వర్గీకరణ కమిటీలో అగ్రకులానికి ఛైర్మన్ పదవా?: ఎర్రోళ్ల

image

TG: SC వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అగ్రకులానికి చెందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఛైర్మన్‌ను చేయడంపై BRS నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ‘ఇది మాదిగలను దగా చేయడమే. అగ్రకులం వ్యక్తితో మాదిగలకు ఏం న్యాయం జరుగుతుంది? SC వర్గాల ఆకాంక్షలు ఎలా నెరవేరుతాయి? ఆరుగురికి కమిటీలో చోటు కల్పిస్తే ఒక్కరు కూడా SC నాయకులు లేరు. ఈ కమిటీని వెంటనే రద్దు చేసి, కొత్తది నియమించాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News November 15, 2025

తెలంగాణ హైకోర్టు వెబ్‎సైట్ హ్యాక్

image

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్‎లోడ్ చేస్తుండగా అంతరాయం కలిగింది. ఈ సమయంలోనే న్యాయస్థానం వెబ్‎సైట్‎లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు హ్యాకర్ల గురించి దర్యాప్తు చేపట్టారు.

News November 15, 2025

రూ.1,201 కోట్ల పెట్టుబడి.. రేమండ్‌ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

image

AP: సీఐఐ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.1,201 కోట్ల మూడు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు రేమండ్ సంస్థ ప్రకటించింది. ఈమేరకు వాటికి సీఎం చంద్రబాబు, సంస్థ ఎండీ గౌతమ్ మైనీ శంకుస్థాపన చేశారు. దేశ ఏరోస్పేస్, రక్షణ అవసరాలను తీర్చేలా రేమండ్ పరికరాలు తయారుచేయడం అభినందనీయమని CBN అన్నారు.

News November 15, 2025

యాపిల్‌కు త్వరలో కొత్త CEO.. టిమ్ కుక్ వారసుడు ఎవరు?

image

2011లో స్టీవ్ జాబ్స్ నుంచి టిమ్ కుక్ యాపిల్‌ CEOగా బాధ్యతలు అందుకున్నారు. కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లిన కుక్.. 2026 ప్రారంభంలో తన వారసుడిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. 2001లో హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన జాన్ టెర్నస్ తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టులో పేర్కొంది.