News September 14, 2024
ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా?: BRS

TG: RR జిల్లా యాచారంలో నిర్మించతలపెట్టిన ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా? అని BRS పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘గతంలో ఫార్మాసిటీ రద్దు చేస్తానని చెప్పిన CM రేవంత్ 13వేల ఎకరాలను అమ్మే కుట్రపన్నారు. కోర్టు అక్షింతలు వేయడంతో మాట మార్చి ఫార్మాసిటీ ఉందంటున్నారు. ఫార్మాసిటీ రద్దు చేస్తే ఆ భూములు వెంటనే రైతులకు ఇవ్వాలి. ఫ్యూచర్ సిటీ, AI సిటీ అంటూ CM ఫేక్ ప్రచారం చేస్తున్నారు’ అని BRS దుయ్యబట్టింది.
Similar News
News November 9, 2025
కార్తీకం: ఆదివారం ఎవరికిలా పూజ చేయాలి?

ఆదివారం సూర్యుడిని పూజించాలని చెబుతారు. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి, సూర్యుడు రాగానే ‘ఓం ఆదిత్యా నమ:’ అంటూ ఆయన పేర్లను స్తుతించాలని పండితుల సూచన. ‘ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. బెల్లం, పాలు, ఎరుపు వస్త్రాలు దాయడం ఉత్తమం. ఉపవాసం మంచిదే. ఉప్పు-నూనె లేని ఆహారం తినవచ్చు. కార్తీకంలో ఈ నియమాల వల్ల సూర్యానుగ్రహంతో జాతకంలో సూర్యుని స్థానం బలపడి శాంతి, మనశ్శాంతి లభిస్తాయి’ అంటున్నారు.
News November 9, 2025
ప్రచారానికి వాళ్లు దూరమేనా!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారానికి దూరమైనట్లేనని సమాచారం. నేటితో ప్రచార పర్వం ముగియనుండగా ఆయన వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఆ బాధ్యతలను కేటీఆర్ భుజాలపై వేసుకొని కొనసాగిస్తున్నారు. అటు బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, అన్నామలై, పురందీశ్వరి, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ వస్తారని పేర్కొన్నా ఇప్పటి వరకు వారి జాడే లేదు.
News November 9, 2025
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ తప్పులు చేయకండి

మనీ ప్లాంట్ ఇంట్లో సానుకూల శక్తిని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని నమ్మకం. అయితే కొన్ని పొరపాట్లు ఆ శక్తిని ప్రతికూలంగా మారుస్తాయట. ‘మనీ ప్లాంట్ ఎండిపోకూడదు. ఎండిపోయిన ఆకులను తొలగిస్తూ ఉండాలి. లేకపోతే ధన నష్టానికి అవకాశముంది. ఈ ప్లాంట్‌ను ఇంటి లోపల పెంచడం ఉత్తమం. ప్రధాన ద్వారం బయట, మెయిన్ డోర్‌కు ఎదురుగా ఉంచకూడదు. ఈ నియమాలతో డబ్బు ప్రవాహం పెరుగుతుంది’ అని నిపుణులు సూచిస్తున్నారు.


