News September 14, 2024
నిమ్స్‌లో పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు
TG: హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు సంచాలకుడు నగరి బీరప్ప తెలిపారు. ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే డాక్టర్ల బృందం వీటిని నిర్వహించనుందని వెల్లడించారు. గుండెకు రంధ్రం, ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నిమ్స్‌లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.
Similar News
News December 30, 2024
ఒక్క సిగరెట్ తాగితే ఎంత జీవితం నష్టపోతారో తెలుసా?
ఒక సిగరెట్ తాగడం వల్ల పురుషులు 17 నిమిషాలు, మహిళలు 22 నిమిషాల జీవితాన్ని కోల్పోతున్నారని ఓ అధ్యయనం అంచనా వేసింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు దీనిపై అధ్యయనం చేశారు. ధూమపానం వల్ల ఎన్నేళ్ల జీవితాన్ని కోల్పోతారో, అన్నే ఏళ్లపాటు ఆరోగ్యంగా జీవించే కాలాన్ని కూడా కోల్పోతారని పరిశోధకులు పేర్కొన్నారు. జీవితం చివర్లో కంటే ఆరోగ్యవంతమైన మధ్య వయస్సును హరిస్తుందని వివరించారు.
News December 30, 2024
యూట్యూబ్‌లో టెన్త్ పేపర్.. నిందితుడు అరెస్ట్
AP: టెన్త్ హాఫ్ ఇయర్లీ పరీక్ష పేపర్లను యూట్యూబ్‌లో <<14900742>>అప్‌లోడ్ చేసిన<<>> అరుణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జామ్‌కు ముందు రోజు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌ను అరుణ్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ పరీక్షను రద్దు చేసి ఈ నెల 20న నిర్వహించారు.
News December 30, 2024
కెరీర్‌లోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు
టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఈ ఏడాది 619 రన్స్ చేసిన అతను 24.76 యావరేజ్ నమోదుచేశారు. 11 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఇదే అత్యల్ప యావరేజ్. 2013లో 66.60, 2014లో 26.33, 2015లో 25.07, 2016లో 57.60, 2017లో 217, 2018లో 26.28, 2019లో 92.66, 2021లో 47.68, 2022లో 30, 2023లో 41.92 యావరేజ్‌తో రన్స్ చేశారు.