News September 14, 2024
రాష్ట్ర వ్యవసాయ సలహాదాడిగా బాధ్యతలు స్వీకరించిన బాన్సువాడ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా నియమితులైన బాన్సువాడ MLA పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. HYD నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని హార్టికల్చర్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొని పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News July 11, 2025
NZB: కలెక్టర్ గారూ.. ఆ PAపై చర్యలు తీసుకోండి

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బేఖాతారు చేస్తూ ప్రజా ప్రతినిధికి పర్సనల్ అసిస్టెంట్(PA)గా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మహాజన సోషలిస్ట్ పార్టీ(MSP) NZB జిల్లా అధ్యక్షుడు సరికేల పోశెట్టి మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్పల్లి మండలం మైలారం ZPHSలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉన్న గడ్డం శ్రీనివాస్ రెడ్డి సెలవులు పెడుతూ PAగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
News July 11, 2025
SRSP UPDATE: 20.318 TMCల నీటి నిల్వ

SRSP ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 TMC) అడుగులకు గాను శుక్రవారం ఉదయానికి 20.318 TMC (1068.10 అడుగులు)ల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టుకు 4,309 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 231 క్యూసెక్కుల నీరు పోతున్నదన్నారు.
News July 11, 2025
NZB: కూలీల కొరత.. పొరుగు రాష్ట్రాల నుంచి బారులు

నిజామాబాద్ జిల్లాలో కూలీల కొరత వేధిస్తోంది. ఇక్కడి వారు ఉపాధి కొసం మలేషియా, కెనడాతో పాటు పలు దేశాలకు వలస వెళ్తున్నారు. దీంతో జిల్లాలో కూలీల కొరత ఏర్పడుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు జిల్లా రైతులు ఆహ్వానం పలుకుతున్నారు. వరినాట్లు, హమాలీ పనులకు బిహార్, బెంగాల్, మహరాష్ట్ర నుంచి కూలీలు వస్తున్నారు. ఒక ఎకరం వరినాట్లు వేస్తే రూ. 4000 నుంచి రూ. 5000 వరకు కూలీ చెల్లిస్తున్నారు.