News September 14, 2024
కొండారెడ్డి బురుజుకు ఆ పేరెలా వచ్చింది?
కర్నూలులోని కొండారెడ్డి బురుజును క్రీ.శ 16వ శతాబ్దంలో అచ్యుతదేవరాయులు నిర్మించారు. 1602-1618 మధ్య అబ్దుల్ వహాబ్ కందనవోలును పరిపాలించే వారు. ఆ సమయంలో నందికొట్కూరు తాలుకాలోని పాతకోట పాలెగాడైన కొండారెడ్డి అతని అధికారాన్ని ధిక్కరించారట. దీంతో వహాబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కారాగారంలో బంధించాడు. అందులోనే మరణించడంతో అతని పేరుమీద దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.
Similar News
News January 15, 2025
పండగ రోజు విషాదం.. వెల్దుర్తిలో చిన్నారి మృతి
కర్నూలు బెంగళూరు 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయ. గిరి (10) అనే బాలుడు దుర్మరణం చెందాడు. వెల్దుర్తి ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు, కళ్యాణిల కుమారుడు గిరి రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యప్తు చేపట్టారు.
News January 15, 2025
నంద్యాల: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. ప్రేమ వ్యవహారమే కారణమా?
కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లెలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అంబటి రామచంద్రారెడ్డి, శివగంగ దంపతుల కుమారుడు శివరాఘవరెడ్డి(25) అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రాఘవరెడ్డి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పలువురు పేర్కొంటున్నారు.
News January 15, 2025
జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభం
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం తూర్పు ప్రాతకోటలో వెలసిన నాగేశ్వరస్వామి సంక్రాంతి తిరుణాళ్ల సందర్భంగా జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను హైకోర్టు న్యాయమూర్తి ఎన్.హరినాథ్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ పిట్టల శేషమ్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 12 మహిళా జట్లు పాల్గొన్నాయి.