News September 14, 2024
నైపుణ్యం ఉన్నవారికి గంభీర్ మద్దతు ఉంటుంది: పీయూష్

టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌పై స్పిన్నర్ పీయూష్ చావ్లా ప్రశంసలు కురిపించారు. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు ఆయన మద్దతుగా నిలుస్తారని తెలిపారు. ‘ఆయన ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతారు. స్వేచ్ఛగా ఆడమని చెబుతారు. మీలో టాలెంట్ ఉందని అనిపిస్తే మీరు ప్రదర్శన చేయకపోయినా అండగా నిలిచి అవకాశాలిస్తారు. ఏ ఆటగాడికైనా అదే కావాలి. గ్రౌండ్‌లో దూకుడుగా ఉండే గౌతీ వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడు’ అని వెల్లడించారు.
Similar News
News January 3, 2026
ఫిబ్రవరిలో డీఎస్సీ.. 2,500 పోస్టులు?

AP: రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. డీఎస్సీలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్‌కు సంబంధించి ఒక పేపర్‌గా ఎగ్జామ్ నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉంది.
News January 3, 2026
మరోసారి తండ్రి అయిన టాలీవుడ్ హీరో

టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ మరోసారి తండ్రి అయ్యారు. జనవరి 2న ఆయన భార్య అరుణ మగ బిడ్డకు జన్మనిచ్చారని సినీ వర్గాలు తెలిపాయి. చాలా కాలం తర్వాత ‘శంబాల’తో హిట్ అందుకున్న ఆయనకు సంతోషం రెట్టింపు అయింది. 2014లో ఆది, అరుణ వివాహం జరగ్గా, వారికి ఓ పాప ఉంది. కాగా శంబాల మూవీ వారం రోజుల్లో రూ.16.2 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
News January 3, 2026
కంది పండితే కరువు తీరుతుంది

మన భోజనంలో కందిపప్పు ప్రధానమైనది. ఇది బాగా పండితే ప్రతి ఇంట్లో నిల్వ ఉండి ఇతర కూరగాయలు లేకపోయినా పప్పు లేదా పప్పుచారుతో కడుపు నింపుకోవచ్చు. అలాగే కంది వర్షాభావ పరిస్థితులను, కరువును తట్టుకుని నిలబడి కరువు కాలంలో రైతుకు భరోసానిస్తుంది. పర్యావరణం పరంగా కంది పంట వల్ల భూమికి నత్రజని అంది నేల సారవంతమై తదుపరి పంటలకు మేలు జరుగుతుంది. ఇన్ని లాభాల వల్లే కంది పండితే కరువు తీరుతుంది అంటారు.


