News September 14, 2024
కోచ్ అవగానే ముందు ఆయనకే ఫోన్ చేశాను: మోర్కెల్

భారత బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ నియమితులైన సంగతి తెలిసిందే. ఆ న్యూస్ మొదటగా తన తండ్రికి కాల్ చేసి చెప్పినట్లు మోర్కెల్ తెలిపారు. ‘విషయం తెలియగానే 5 నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయా. ఆ తర్వాత మా నాన్నకి ఫోన్ చేశాను. ముందుగా ఆయనకే చెప్పాలనిపించింది. భారత ఆటగాళ్లతో చాలాసార్లు పోటీ పడ్డాను. ఇప్పుడు వారితో స్నేహం పెంచుకోవాలి. కోచింగ్‌లో అది చాలా కీలకం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2026
రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలా?

ప్రతి ఒక్కరూ రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగాలనే నియమానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని డాక్టర్లు చెబుతున్నారు. నీటి అవసరం అనేది మనిషి బరువు, చేసే పని, ఉండే వాతావరణంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అందరికీ ఒకే లెక్క సరిపోదని, మన శరీరానికి నీరు కావాలనిపించినప్పుడు ‘దాహం’ రూపంలో సంకేతం ఇస్తుందని వివరించారు. అందువల్ల దాహం వేయకపోయినా బలవంతంగా నీళ్లు తాగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. SHARE IT
News January 20, 2026
పిల్లల వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారా?

వ్యాక్సిన్లు ఇవ్వడం అనేది పిల్లలను కేవలం వ్యక్తిగత వ్యాధుల నుంచి రక్షించడమే కాక Herd Immunityని పెంచుతుందంటున్నారు నిపుణులు. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏఏ టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధుల నివారణ, ఇమ్యునిటీ పెరగడం వల్ల అనారోగ్యాలు తగ్గి ఆరోగ్యకరమైన భవిష్యత్తు లభిస్తుంది. కాబట్టి పిల్లల టీకాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.
News January 20, 2026
వెండి భగభగలు.. కారణమిదే!

వెండి ధరలు ఆకాశాన్ని తాకడానికి చైనా నిర్ణయాలే ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ వెండి సరఫరాలో ఆధిపత్యం ఉన్న చైనా తన క్లీన్ ఎనర్జీ (సోలార్, EV) అవసరాల కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనికి తోడు అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువ తగ్గడం, పారిశ్రామిక డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం KG వెండి ధర ₹3.40లక్షలు ఉండగా త్వరలోనే రూ.4లక్షలు క్రాస్ చేస్తుందని అంచనా.


